Twitter : ట్విట్టర్ లో కొత్త ఫీచర్.. గూగుల్ అకౌంట్, యాపిల్ ఐడీ ఉంటే చాలు
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తాజాగా సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ట్విట్టర్ లో లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చేది. ఆ సమయంలో పర్సనల్ డిటెయిల్స్ అన్నీ నమోదు చేయడానికి కాస్త సమయం పట్టేది.
Twitter : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తాజాగా సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ట్విట్టర్ లో లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చేది. ఆ సమయంలో పర్సనల్ డిటెయిల్స్ అన్నీ నమోదు చేయడానికి కాస్త సమయం పట్టేది. అయితే.. తమ యూజర్లకు మరింత ఈజీగా లాగిన్ ను ప్రొవైడ్ చేయడం కోసం ట్విట్టర్ సరికొత్త లాగిన్ ఆప్షన్ ను తీసుకొచ్చింది. కేవలం యాపిల్ ఐడీ ఉంటే చాలు.. ట్విట్టర్ లోకి లాగిన్ అవ్వొచ్చు. యాపిల్ వస్తువులు వాడేవాళ్లు కేవలం తమ యాపిల్ ఐడీతో లాగిన్ అయ్యే ఆప్షన్‌ను ట్విట్టర్ తీసుకొచ్చింది. అలాగే.. ఆండ్రాయిడ్ ఫోన్లు, విండోస్ కంప్యూటర్లు వాడేవాళ్లు.. కేవలం గూగుల్ అకౌంట్‌తో ట్విట్టర్లోకి లాగిన్ అవ్వొచ్చు.

ఇప్పటికే ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న యూజర్లు మాత్రం తమ అకౌంట్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మెయిల్ ఐడీ డిటెయిల్స్ తో లాగిన్ అవ్వొచ్చు. అలాగే.. యాపిల్ యూజర్లు.. అప్పుడు ఇచ్చిన యాపిల్ ఐడీతో లాగిన్ అవ్వొచ్చు.
Twitter : యాపిల్ ఐడీతో ప్రస్తుతానికి ఐఓఎస్ డివైజ్ లలోనే ట్విట్టర్ లాగిన్
ప్రస్తుతం యాపిల్ ఐడీతో కేవలం ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న డివైజ్ లలో మాత్రమే ట్విట్టర్‌కు సైన్ అప్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే మాక్ ఓఎస్‌లో కూడా ట్విట్టర్‌తో లాగిన్ అయ్యే ఫీచర్‌ను తీసుకురానున్నారు. గూగుల్ అకౌంట్‌తో మాత్రం ఆండ్రాయిడ్ యూజర్లు, ఐఓఎస్ యూజర్లు, విండోస్ యూజర్లు వెబ్ బ్రౌజర్ తో లాగిన్ అవ్వొచ్చు.
కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ వల్ల సైన్ అప్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఈమెయిల్ ఐడీ, పాస్ వర్డ్, పేరు, ట్విట్టర్ యూజర్ హాండిల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ట్విట్టర్ హాండిల్ పేరును కూడా ఆటోమెటిక్ గా సిస్టమ్ సజెస్ట్ చేస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

