మోటోరోలా ఇండియా కంపెనీ తన బడ్జెట్ ఫోన్ జీ52ను సోమవారం విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ 90 హెచ్జడ్ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేలాంటి హై ఎండ్ స్పెసిఫికేషన్ కలిగి ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా ఉంటుంది. గతేడాది రిలీజ్ చేసిన మోటో జీ51 5జీ స్మార్ట్‌ఫోన్‌కు ఇది అప్‌గ్రేడ్ వేరియంట్.
మోటోరోలా ఇండియా రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ను విడుదల చేసిది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499 కాగా, 6 జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499గా పేర్కొంది. చార్కోల్ గ్రే, పోర్సీలెయిన్ వైట్ కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.. మే 3 మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకాలు ప్రారంభమవుతాయని మోటోరోలా ఇండియా పేర్కొంది. ఫ్లిప్కార్డ్తోపాటు ఇతర అన్ని లీడింగ్ స్టోర్స్‌లో ఈ ఫోన్లు లభ్యమవుతాయి.
మెటో జీ52 ప్రత్యేకతలు