Tesla Balance Bike | టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బ్యాలెన్స్ బైక్.. ధర ఎంత ? ప్రత్యేకతలేంటి..?
ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్యాలెన్స్ బైక్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. పెడల్స్ లేకుండా రూపొందించిన ఈ తేలికపాటి సైకిల్ పిల్లలు సాధారణ సైకిల్‌కు మారే ముందు బ్యాలెన్స్, కోఆర్డినేషన్ నైపుణ్యాలను సహజంగా అభివృద్ధి చేసుకునేలా రూపొందించారు.
Tesla Balance Bike | ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్యాలెన్స్ బైక్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. పెడల్స్ లేకుండా రూపొందించిన ఈ తేలికపాటి సైకిల్ పిల్లలు సాధారణ సైకిల్‌కు మారే ముందు బ్యాలెన్స్, కోఆర్డినేషన్ నైపుణ్యాలను సహజంగా అభివృద్ధి చేసుకునేలా రూపొందించారు. అమెరికాలో ఈ బ్యాలెన్స్ బైక్ ధర 225 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.21వేలు)గా ఉంది. టెస్లా ఇప్పటికే పిల్లల కోసం ఆప్టిమస్ యాక్షన్ ఫిగర్, చిన్నారుల దుస్తులు, సైబర్‌క్వాడ్ ఫర్ కిడ్స్, సైబర్‌ట్రక్ రైడ్-ఆన్ టాయ్ వంటి ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇప్పుడు ఆ జాబితాలో బ్యాలెన్స్ బైక్ కూడా చేరింది.
పెడల్స్, చైన్ ఉండవు..
సాధారణ పిల్లల సైకిళ్లతో పోలిస్తే ఈ బ్యాలెన్స్ బైక్‌లో పెడల్స్ లేదా చైన్ ఉండవు. పిల్లలు తమ కాళ్లతో నేలను తట్టి ముందుకు కదులుతూ ప్రయాణిస్తారు. దీంతో బ్యాలెన్స్, స్టీరింగ్ నైపుణ్యాలు సహజంగానే మెరుగుపడతాయని టెస్లా చెబుతోంది. ఈ బైక్ ను 2 నుంచి 5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు అనుకూలంగా రూపొందించారు. గరిష్టంగా 35 కిలోల బరువును మోస్తుంది. పిల్లల ఎదుగుదలకు అనుగుణంగా ఐదు స్థాయిల్లో సీటు ఎత్తును సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా ఉంది. తేలికపాటి మెగ్నిషియం ఫ్రేమ్ కారణంగా సంప్రదాయ చిన్నారుల సైకిళ్లతో పోలిస్తే దీనిని నియంత్రించడం సులభమని కంపెనీ తెలిపింది. తెలుపు రంగు ఫ్రేమ్, నలుపు రంగు అడ్జస్టబుల్ సీటు, పక్క భాగంలో టెస్లా లోగో, ముందు భాగంలో టి ఎంబ్లమ్‌తో టెస్లాకు ప్రత్యేకమైన మినిమలిస్టిక్ డిజైన్‌ను ఇందులో అందించారు.
ప్రీమియం విభాగంలో పోటీగా..
225 డాలర్ల ధరతో టెస్లా బ్యాలెన్స్ బైక్ ప్రీమియం విభాగాన్ని లక్ష్యంగా నిర్ణయించుకుంది. మార్కెట్లో 100 డాలర్ల కంటే తక్కువ ధరలో లభించే అనేక బ్యాలెన్స్ బైక్‌లు ఉన్నప్పటికీ, డిజైన్, బ్రాండ్ విలువతో టెస్లా ఈ ప్రీమియం విభాగంలో పోటీ పడుతోంది. ఆన్లైన్ స్టోర్‌లో విక్రయానికి వచ్చిన కొద్ది సేపటికే ఈ ఉత్పత్తికి భారీ డిమాండ్ ఏర్పడటంతో స్టాక్ పూర్తిగా అయిపోయింది. ప్రస్తుతం ఆసక్తి ఉన్న వినియోగదారులు తదుపరి స్టాక్ కోసం వెయిటింగ్ జాబితాలో చేరుతున్నారు. ఎలక్ట్రిక్ కార్లకే పరిమితం కాకుండా జీవనశైలి ఉత్పత్తుల విభాగంలో కూడా తన బ్రాండ్‌ను విస్తరించాలనే టెస్లా వ్యూహంలో భాగంగానే ఈ కొత్త బ్యాలెన్స్ బైక్‌ను తీసుకొచ్చింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

