Tecno Spark Go 5G | అత్యంత చవక ధరకే టెక్నో నుంచి కొత్త 5జి స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
ప్రస్తుతం చాలా మంది బడ్జెట్ ధరలోనే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. వాటిల్లో ఆకర్షణీయమైన ఫీచర్లను సైతం కోరుకుంటున్నారు. అందులో భాగంగానే కంపెనీలు సైతం అలాంటి ఫోన్లనే రూపొందించి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాయి.
Tecno Spark Go 5G | ప్రస్తుతం చాలా మంది బడ్జెట్ ధరలోనే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. వాటిల్లో ఆకర్షణీయమైన ఫీచర్లను సైతం కోరుకుంటున్నారు. అందులో భాగంగానే కంపెనీలు సైతం అలాంటి ఫోన్లనే రూపొందించి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాయి. ఇక ఇదే కోవలో టెక్నో కంపెనీ కూడా ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. స్పార్క్ గో 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందిచడంతోపాటు ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ఫోన్లో 6.74 ఇంచుల డాట్ ఇన్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను, హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. అందువల్ల డివైస్ డిస్ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు.
అదిరిపోయే ఏఐ ఫీచర్లు..
ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 4జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. అదనంగా మరో 4జీబీ వరకు ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను 5 ఏళ్ల పాటు ఎలాంటి ల్యాగ్ లేకుండా ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఇందులో ఎల్లా ఏఐ అనే ఏఐ ఫీచర్లను అందిస్తున్నారు. మల్టి లాంగ్వేజ్ సపోర్ట్, ఏఐ కాల్ అసిస్టెంట్, ఏఐ ఆటో ఆన్సర్, ఏఐ వాయిస్ ప్రింట్ నాయిస్ సప్రెషన్ వంటి ఏఐ టూల్స్‌ను ఇందులో అందిస్తున్నారు. అందువల్ల వినియోగదారులు అద్భుతమైన ఏఐ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్లో నో నెట్వర్క్ కమ్యూనికేషన్ అనే ఫీచర్‌ను సైతం అందిస్తున్నారు. దీని వల్ల మొబైల్ సిగ్నల్ లేకున్నా ఫోన్ పని చేసేలా ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేయగా దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సింగిల్ వేరియెంట్ ఆప్షన్లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఈ ఫోన్లో మెమొరీని పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్‌లతోపాటు మైక్రో ఎస్డీ కార్డు కోసం ఇందులో ప్రత్యేకంగా స్లాట్‌ను ఇచ్చారు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ కెమెరా ఉండగా దీనికి ఎల్ఈడీ ఫ్లాష్ సదుపాయం కూడా ఉంది. 30ఎఫ్‌పీఎస్‌తో 2కె వీడియోలను ఈ కెమెరా ద్వారా రికార్డు చేసుకోవచ్చు. అలాగే ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంటుంఇ. 3.5ఎంఎం ఆడియో జాక్ కూడా ఉంది.
ధర వివరాలు..
ఈ ఫోన్‌కు ఐపీ64 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెంట్ ఫీచర్‌ను సైతం అందిస్తున్నారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లు సైతం ఈ ఫోన్లో ఉన్నాయి. టెక్నో స్పార్క్ గో 5జి స్మార్ట్ ఫోన్‌ను స్కై బ్లూ, ఇంక్ బ్లాక్, టార్కాయిస్ గ్రీన్, బికనీర్ రెడ్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన సింగిల్ వేరియెంట్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు అన్ని రిటెయిల్ స్టోర్స్‌లో ఆగస్టు 21 నుంచి విక్రయించనున్నారు. ఈ ఫోన్‌ను ప్రీ బుకింగ్ చేసుకున్న వారు రూ.1 కోటి వరకు నగదు బహుమతిని గెలుచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

