First iPhone | 15 ఏళ్ల క్రితం ఇదే రోజు.. తొలి ఐఫోన్ మార్కెట్లోకి.. స్టీవ్ జాబ్స్ ఫోన్ లాంచ్ చేస్తూ ఏమన్నారో తెలుసా?
First iPhone | తొలి ఐఫోన్‌ను ఎప్పుడు లాంచ్ చేశారు? స్టీవ్ జాబ్స్ ఐఫోన్ల తయారీపై ఎందుకు దృష్టి పెట్టారు. అప్పుడు విడుదలైన తొలి ఐఫోన్ ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం రండి.
First iPhone | ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్స్‌కు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఐఫోన్లకు 1 బిలియన్ యూజర్లు ఉన్నారు. అంటే.. 100 కోట్ల మంది యూజర్లు అన్నమాట. అయితే.. తొలి ఐఫోన్‌ను ఎప్పుడు లాంచ్ చేశారు? స్టీవ్ జాబ్స్ ఐఫోన్ల తయారీపై ఎందుకు దృష్టి పెట్టారు. అప్పుడు విడుదలైన తొలి ఐఫోన్ ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం రండి.

జనవరి 9, 2007.. అంటే నేటికి సరిగ్గా 15 ఏళ్లు. ఈరోజున తొలి ఐఫోన్(జనరేషన్ 1)ను యాపిల్ ఫౌండర్లలో ఒకరైన స్టీవ్ జాబ్స్ ఆవిష్కరించారు. మాక్వరల్డ్ ఈవెంట్లో స్టీవ్ జాబ్స్ తొలి ఐఫోన్‌ను లాంచ్ చేశారు.
అప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బెర్రీ ఫోన్లకు చాలా డిమాండ్ ఉండేది. కాకపోతే.. ఆ ఫోన్లు కీపాడ్‌తో వచ్చేవి. కానీ.. కీపాడ్ అవసరం లేకుండా.. టచ్ స్క్రీన్‌తో ఆన్‌స్క్రీన్ కీపాడ్ను తొలిసారి ఐఫోన్ జనరేషన్ 1లో ఆవిష్కరించారు. దీంతో తొలి ఐఫోన్ సూపర్ డూపర్ హిట్ అయింది. చాలామంది ఆ ఫోన్‌ను కొనుగోలు చేశారు. అలా.. ఐఫోన్లు యూజర్లకు చేరువయ్యాయి.
తొలి ఐఫోన్ రిలీజ్ అయినప్పటి విశేషాలను తెలియజేస్తూ చాలా పుస్తకాలు, పాడ్‌కాస్ట్, డాక్యుమెంటరీలు వచ్చాయి. యూట్యూబ్‌లోనూ తొలి ఐఫోన్ లాంచ్ వీడియో ఉంది. తొలి ఐఫోన్.. స్మార్ట్ఫోన్ల శకానికి నాంది పలికింది. అలాగే ఐపాడ్ మ్యూజిక్ ప్లేయర్స్‌కు తొలి ఐఫోన్ ముగింపు పలికింది.
ఇక.. తొలి ఐఫోన్‌ను లాంచ్ చేస్తూ స్టీవ్ జాబ్స్ ఏమన్నారంటే.. 1984లో మేము మాకింతోష్ను లాంచ్ చేశాం. కానీ.. అది యాపిల్ సంస్థలో మాత్రమే కాదు.. కంప్యూటర్ ఇండస్ట్రీనే మార్చేసింది. 2001లో తొలి ఐపాడ్‌ను లాంచ్ చేశాం. మ్యూజిక్ వినే విధానాన్నే పూర్తిగా మార్చేసింది. మ్యూజిక్ ఇండస్ట్రీలోనే విప్లవాత్మక మార్పులు వచ్చేలా చేసింది ఐపాడ్. ఇప్పుడు మరో సరికొత్త ప్రాడక్ట్‌ను తీసుకొస్తున్నాం. దానికి ఐఫోన్ అని పేరు పెట్టాం. ఐదేళ్ల తర్వాత ఎలాంటి ఫీచర్లతో ఫోన్లు రాబోతున్నాయో ముందే ఊహించి.. ఈ ఫోన్‌ను తీసుకొచ్చాం.. అంటూ ఐఫోన్ లాంచ్ ఈవెంట్లో స్టీవ్ జాబ్స్ స్పష్టం చేశారు.
2007లో తొలి ఐఫోన్‌ను రిలీజ్ చేసినప్పుడు దాని ధర 499 యూఎస్ డాలర్లు. అంటే అప్పటి యూఎస్ డాలర్లతో పోల్చితే రూ.2000 అన్నమాట. ఈసమయంలో ఆ ఫోన్‌ను లాంచ్ చేస్తే 499 డాలర్లకు.. రూ.37000 చెల్లించాల్సి ఉంటుంది. యూఎస్‌లో జూన్ 29, 2007న తొలి ఐఫోన్‌ను రిలీజ్ చేశారు. ఫోన్ రిలీజ్ అయిన రెండు నెలల్లోనే 10 లక్షల ఫోన్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

