layoffs | ఉద్యోగులపై వేటుకు స్నాప్ సన్నాహాలు
ఆర్ధిక మందగమనంతో పలు టెక్ కంపెనీలు నియామక ప్రక్రియను నిలిపివేయడం, ఉద్యోగుల తొలగింపు వంటి వ్యయ నియంత్రణ చర్యలకు పాల్పడుతున్నాయి.
న్యూయార్క్ : ఆర్ధిక మందగమనంతో పలు టెక్ కంపెనీలు నియామక ప్రక్రియను నిలిపివేయడం, ఉద్యోగుల తొలగింపు వంటి వ్యయ నియంత్రణ చర్యలకు పాల్పడుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ట్విట్టర్, టిక్‌టాక్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్‌ను ప్రకటించగా తాజాగా స్నాప్ పలువురు ఉద్యోగులను సాగనంపేందుకు సన్నాహాలు చేపట్టినట్టు వెల్లడైంది. లేఆఫ్స్ దిశగా కంపెనీ మేనేజర్లు ప్రణాళికపై కసరత్తు సాగిస్తున్నట్టు సమాచారం.
ఉద్యోగుల తొలగింపుపై కంపెనీ ఇప్పటివరకూ నిర్ధష్ట వివరాలను వెల్లడించలేదు. నిరాశజనక ఆర్ధిక ఫలితాలు ప్రకటించిన అనంతరం సిబ్బందిపై వేటుకు స్నాప్ కసరత్తు సాగిస్తోందనే వార్తలు వెల్లడయ్యాయి. 6000 మంది స్నాప్ ఉద్యోగుల్లో ఎంతమందిపై వేటు వేస్తారనే వివరాలపై స్పష్టత లేదు. ఏయే ఉద్యోగులను ఏ కారణాలపై తొలగించాలనే విషయంలో మేనేజర్లు ఇంతవరకూ ఓ నిర్ణయానికి రాలేదని వార్తలు వచ్చాయి.
2018లోనూ స్నాప్ పలువురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. హైరింగ్ ప్రక్రియను నిలిపివేసి అదనపు వ్యయాలను ఆదా చేస్తామని స్నాప్ సీఈవో ఇవాన్ స్పీగెల్ ఏడాది ఆరంభంలో పేర్కొన్నారు. గత కొన్నేండ్లుగా యాడ్స్ బిజినెస్ వృద్ధి మందగించడంతో పాటు సెల్పీ డ్రోన్ వంటి హార్డ్‌వేర్ ఉత్పత్తుల విక్రయంలో స్నాప్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

