జియో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది

ముంబై: రిలయెన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించారు ఆ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ. దీనికి జియోఫోన్ నెక్ట్స్ అనే పేరు పెట్టారు. ఇది ఆండ్రాయిడ్ స్పెషల్ వెర్షన్‌పై పని చేయనుంది. గతంలో జియోఫోన్, జియోఫోన్ 2 అనే రెండు ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసిన జియో.. తొలిసారి పూర్తి ఫీచర్లతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ వచ్చే వినాయక చవితి అంటే సెప్టెంబర్ 10 నుంచి మార్కెట్లోకి రానుందని అంబానీ వెల్లడించారు. వరుసగా రెండో ఏడాది కూడా వర్చువల్‌గానే జరిగిన ఏజీఎంలో ముకేశ్ ఈ ఫోన్ గురించి ప్రస్తావించారు.
గూగుల్, జియో టీమ్స్ కలిసి నిజంగానే ఓ బ్రేక్‌త్రూ స్మార్ట్‌ఫోన్ అయిన జియోఫోన్ నెక్ట్స్‌ను డెవలప్ చేశాయి అని అంబానీ చెప్పారు. గూగుల్, జియో అందించే అన్ని అప్లికేషన్లను ఇది సపోర్ట్ చేస్తుందని అన్నారు. ఈ ఫోన్ కోసం ఆప్టిమైజ్ చేసిన ఓ ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ వెర్షన్‌ను తమ టీమ్ తయారు చేసిందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. ఇది కేవలం ఇండియన్ యూజర్ల కోసం అందులోనూ తొలిసారి స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న వారి కోసం రూపొందించినట్లు పిచాయ్ తెలిపారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

