న్యూఢిల్లీ : ఫిబ్రవరి 1న గెలాక్సీ ఎస్23 సిరీస్‌ను లాంఛ్ చేసేందుకు శాంసంగ్ సన్నాహాలు చేపట్టింది. లాంఛ్‌కు ముందు శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా ధర ఆన్లైన్లో లీకయింది. గెలాక్సీ ఎస్22 సిరీస్ కొనసాగింపుగా శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ కస్టమర్ల ముందుకు రానుంది.
ఇక గెలాక్సీ ఎస్23 సిరీస్‌లో భాగంగా ఎస్23, ఎస్23 ప్లస్, ఎస్23 అల్ట్రా రానున్నాయి. ఇక కెమెరా, డిజైన్, స్పెసిఫికేషన్స్ పరంగా మేజర్ అప్గ్రేడ్లతో రానున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎస్23 అల్ట్రా ఇమేజ్‌లను శ్లాష్లీక్స్ అనే వెబ్సైట్ లీక్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ధర దాదాపు రూ . 1,13,400 ఉంటుందని లీక్‌లో వెల్లడైంది.
గెలాక్సీ ఎస్23 అల్ట్రా బొటానిక్ గ్రీన్, కాటన్ ఫ్లవర్, మిస్టీ లిల్, ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుందని అంచనా. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 6.8 ఇంచ్ డిస్ప్లేతో ఆక్టా కోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్తో రానుంది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 200 ఎంపీ ప్రైమరీ కెమెరాతో కస్టమర్లను ఆకట్టుకోనుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.