Redmi 10 : బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్లతో రెడ్మీ 10.. లీకైన ఫీచర్లు ఇవే
జియోమీ రెడ్మీ సిరీస్ ఇండియాలో సూపర్ సక్సెస్ అయింది. రెడ్మీ సిరీస్ ఫోన్లలో ఎక్కువ శాతం జనాలు కొనుగోలు చేశారు. దీంతో జియోమీకి భారత్‌లో మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే.. ఎప్పటికప్పుడు ఫీచర్లను యాడ్ చేస్తూ.. సరికొత్త మోడల్స్‌ను జియోమీ విపణిలోకి తెస్తోంది.
ఈసారి సరికొత్త ఫీచర్లతో రెడ్మీ 10 మోడల్‌ను తీసుకురానుంది. నిజానికి.. ఈ మోడల్ ఫోన్.. ఆగస్టు 13నే విడుదల కావాల్సి ఉన్నా.. విడుదలను వాయిదా వేసింది జియోమీ. ఈనెల చివర్లో రెడ్మీ 10 విడుదలయ్యే అవకాశం ఉంది.

రెడ్మీ 9 మోడల్‌కు కొనసాగింపుగా వస్తున్నప్పటికీ.. రెడ్మీ 10లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. హోల్ పంచ్ డిస్ప్లే, క్వాడ్ రేర్ కెమెరాలతో పాటు లేటెస్ట్ ఎంఐయూఐ ఎక్స్‌పీరియన్స్‌తో ఈ ఫోన్ రానుంది.
రెడ్మీ 10 లో మూడు వేరియంట్లు రానున్నాయి. 4జీబీ + 64 జీబీ, 4 జీబీ + 128 జీబీ, 6 జీబీ + 128 జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ విడుదల కానుంది. గ్రే, వైట్ అండ్ బ్లూ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది.
రెడ్మీ 10 స్పెషిఫికేషన్స్ ఇవే
డ్యుయల్ సిమ్(నానో), ఆండ్రాయిడ్ 11 ఓఎస్, ఎంఐయూఐ 12.5, 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 1080 * 2400 పిక్సెల్స్ డాట్ డిస్ప్లే, 90 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 20 : 9 యాస్పెక్ట్ రేషియో, ఆక్టా కోర్ మీడియా టెక్ హెలియో జీ88 ఎస్ఓసీ, 50 ఎంపీ రేర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 9 వాట్స్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉంటాయి. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.8,999 నుంచి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

