Realme P4 Pro 5G | భారీ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో లాంచ్ అయిన రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..?
రియల్‌మి కంపెనీ పి4 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసిన విషయం విదితమే. అయితే ఈ ఫోన్‌కు కొనసాగింపుగా మరో నూతన మోడల్‌ను ప్రో వేరియెంట్‌గా లాంచ్ చేసింది. రియల్‌మి పి4 ప్రొ 5జి పేరిట ఈ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేశారు.
Realme P4 Pro 5G | రియల్‌మి కంపెనీ పి4 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసిన విషయం విదితమే. అయితే ఈ ఫోన్‌కు కొనసాగింపుగా మరో నూతన మోడల్‌ను ప్రో వేరియెంట్‌గా లాంచ్ చేసింది. రియల్‌మి పి4 ప్రొ 5జి పేరిట ఈ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేశారు. ఇందులో అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ఫోన్లో 6.8 ఇంచుల అమోలెడ్ 4డి కర్వ్డ్ డిస్ప్లేను ఏర్పాటు చేయగా దీనికి 1.5కె రిజల్యూషన్, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే అద్బుతమైన క్వాలిటీని కలిగి ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఇక ఈ ఫోన్‌ను సూర్యకాంతిలోనూ స్పష్టంగా వీక్షించేలా దీనికి ఏకంగా 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తున్నారు.
అద్భుతమైన ఏఐ ఫీచర్లు..
ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఏఐ ఫీచర్లను ఉపయోగించుకునేందుకు గాను హైపర్ విజన్ ఏఐ చిప్‌ను అమర్చారు. దీని సహాయంతో ఫోన్లో పలు ఏఐ ఫీచర్లను పొందవచ్చు. డివైస్ చాలా వేగంగా పనిచేస్తుంది. అద్భుతమైన ప్రదర్శనను ఇస్తుంది. ఏఐ హైపర్ మోషన్, ఏఐ ఆల్వేస్ ఆన్ హెచ్డీఆర్ వంటి అధునాతన ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్లో ప్రత్యేకంగా వీసీ కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్‌ను ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ అంత త్వరగా హీట్‌కు గురి కాదు. 12జీబీ వరకు ర్యామ్‌ను ఇందులో అందిస్తున్నారు. అదనంగా మరో 14జీబీ వరకు ర్యామ్‌ను ఇందులో వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు. ఈ ఫోన్‌కు గాను ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. దీనికి 3 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ను, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందించనున్నట్లు కంపెనీ చెబుతోంది.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. ముందు వైపు కూడా మరో 50 మెగాపిక్సల్ కెమెరా ఉంది. అందువల్ల నాణ్యమైన చిత్రాలను ఈ కెమెరాలతో బంధించుకోవచ్చు. అలాగే 4కె వీడియోలను చాలా సులభంగా చిత్రీకరించుకోవచ్చు. అల్ట్రా స్టడీ వీడియో, ఏఐ మోషన్ స్టెబిలైజేషన్, ఏఐ ట్రావెల్ స్నాప్, ఏఐ ల్యాండ్ స్కేప్ వంటి ఏఐ ఫొటో, వీడియో ఫీచర్లను ఈ ఫోన్లో అందిస్తున్నారు. 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ సైతం ఇందులో ఉంది. దీనికి 80 వాట్ల అల్ట్రా చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే 10 వాట్ల రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. దీని సహాయంతో ఇతర ఫోన్లను కూడా చార్జింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఫోన్‌ను కేవలం 25 నిమిషాల్లోనే 50 శాతం వరకు చార్జింగ్ చేసుకోవచ్చు.
ధర వివరాలు..
రియల్‌మి పి4 ప్రొ స్మార్ట్ ఫోన్‌ను 8జీబీ, 12జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ మోడల్స్‌లో లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్ లను వేసుకోవచ్చు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లను అందిస్తున్నారు. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి ఫీచర్లను సైతం ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను బిర్క్ వుడ్, డార్క్ ఓక్ వుడ్, మిడ్నైట్ ఐవీ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.24,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999గా ఉంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.28,999గా నిర్ణయించారు. లాంచింగ్ కింద బ్యాంక్ ఆఫర్‌తో ఈ ఫోన్‌ను రూ.3000 తగ్గింపు ధరకు పొందవచ్చు. మరో రూ.2వేల వరకు అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. 3 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఆగస్టు 27 నుంచి ఈ ఫోన్‌ను అమెజాన్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఆన్లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్రయించనున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’.. లుకౌట్ నోటీస్‌పై అభిజిత్ దిప్కే
Tragedy | ఘోరం.. ఇనుపకడ్డీలు మీదపడి డిగ్రీ విద్యార్థిని మృతి
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక అంశాలకు ఆమోదం.. పెనుకొండలో కియా ప్లాంట్-2కు పచ్చ జెండా
Samsung | గెలాక్సీ ఏఐకి కొత్త ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ.. శాంసంగ్ కీలక ప్లాన్..
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

