Realme: రియల్మీ ఫోన్ మరో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. రియల్మీ నజ్రో ఎన్53(Realme Nazro N53) పేరుతో ఈ నెల 18న స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. గత నెలలో నజ్రో ఎన్55ను రిలీజ్ చేశారు. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. అయితే ఇప్పుడు తీసుకొస్తున్న ఎన్53 ఫోన్ ధర మరింత తక్కువ ఉండేందుకు అవకాశాలున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఫీచర్లు: ఈ ఫోన్ మార్కెట్లలోకి విడుదల కాకముందే కొన్ని ఫీచర్లు తెలిశాయి. నజ్రో ఎన్53 ఫోన్ గోల్డ్ ఫిష్ కలర్లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో ఈ కలర్‌తో ఫోన్ రాలేదు. ఫోన్ వెనకవైపు ప్యానల్లో 3 కటౌట్స్ ఉన్నాయి. అందులో 2 కెమెరాలు, ఒకటి LED ఫ్లాష్ లైట్. 16GB వర్చువల్ ర్యామ్, 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫోన్ కుడివైపున వాల్యూమ్ రాకర్స్‌తో పాటు పవర్ బటన్ ఉంది. పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌గా కూడా పనిచేయనుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే 5000mAH బ్యాటరీ ఉంటుందని టెక్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ ఫోన్ అమెజాన్‌లో అమ్మకాలకు సిద్ధంగా ఉంది.