realme C73 5G | భారీ బ్యాటరీతో బడ్జెట్ ధరకే లాంచ్ అయిన రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు ఇవే..!
తక్కువ బడ్జెట్లోనే భారీ బ్యాటరీతోపాటు 5జి సేవలను అందించే స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా.. అయితే మీ కోసమే రియల్ మి ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రియల్‌మి సి73 5జి పేరిట లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
realme C73 5G | తక్కువ బడ్జెట్లోనే భారీ బ్యాటరీతోపాటు 5జి సేవలను అందించే స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా.. అయితే మీ కోసమే రియల్ మి ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రియల్‌మి సి73 5జి పేరిట లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో 6.67 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌తోపాటు 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ డిస్ప్లే క్వాలిటీగా ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ ఆక్టాకోర్ 6300 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 4జీబీ ర్యామ్ లభిస్తుంది. మరో 8జీబీ వరకు డైనమిక్ ర్యామ్‌ను అదనంగా పెంచుకునే వీలు కల్పించారు.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత రియల్‌మి యూఐ 6.0 ను ఏర్పాటు చేశారు. వెనుక వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఐపీ64 డస్ట్, స్ల్పాష్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఈ ఫోన్‌కు ఉంది. ఆర్మర్ షెల్ ప్రొటెక్షన్ ఫీచర్‌ను ఈ ఫోన్‌కు అందిస్తున్నారు. అందువల్ల కింద పడినా అంత సులభంగా ఈ ఫోన్ పగలదు. ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ బ్యాటరీ అని చెప్పవచ్చు. ఇందులో ఏకంగా 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు.
రెండు వేరియెంట్లు..
ఈ ఫోన్ 64జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో లాంచ్ అయింది. మెమొరీని కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్ ను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ కు పక్క భాగంలో ఉంటుంది. యూఎస్బీ టైప్ సి ఆడియోకు ఇందులో సపోర్ట్‌ను అందిస్తున్నారు. 5జి సేవలను ఈ ఫోన్లో ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లు కూడా ఈ ఫోన్లో ఉన్నాయి.
ధర వివరాలు..
రియల్‌మి సి73 5జి స్మార్ట్ ఫోన్ జేడ్ గ్రీన్, క్రిస్టల్ పర్పుల్, ఆనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లాంచ్ కాగా ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.10,499గా ఉంది. అలాగే 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,499గా ఉంది. ఈ ఫోన్‌ను రియల్‌మి ఆన్లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు అందిస్తున్నారు. అన్ని బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో ఈఎంఐ కింద ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.500 ఫ్లాట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

