ChatGPT: చాట్‌జీపీటీని నమ్మి విద్యార్థులందరినీ ఫెయిల్ చేశాడు.. చివరికి.!
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఎంత ఉపయోగకరంగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. టెక్సాస్ యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్ చాట్‌జీపీటీని (ChatGPT)నమ్మి విద్యార్థులందరినీ ఫెయిల్ చేసిన సంఘటన జరిగింది.
ChatGPT: ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఎంత ఉపయోగకరంగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. పనిలో ఏఐ గొప్ప ఫలితాలనే ఇస్తున్నప్పటికీ పూర్తిగా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి. టెక్సాస్ యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్ చాట్‌జీపీటీని (ChatGPT)నమ్మి విద్యార్థులందరినీ ఫెయిల్ చేసిన సంఘటన జరిగింది.
వివరాల ప్రకారం.. టెక్సాస్ యూనివర్సిటీలోని విద్యార్థులు ఫైనల్ పరీక్షల్లో భాగంగా వ్యాసాలు సబ్మిట్ చేశారు. అయితే వారి ప్రొఫెసర్ ఆ వ్యాసాలను స్కాన్ చేయడానికి చాట్‌జీపీటీని ఉపయోగించారు. స్టూడెంట్స్ సబ్మిట్ చేసిన వ్యాసాలు విద్యార్థులు కంప్యూటర్ ద్వారా రాశారని ChatGPT చెప్పింది. దీంతో విద్యార్థులందరినీ ఆ ప్రొఫెసర్ ఫెయిల్ చేశాడు.
అయితే ఆ తర్వాత చాట్‌జీపీటీ చెప్పింది తప్పు అని తేలింది. అంతేకాకుండా విద్యార్థులు స్వయంగా రాశారని తెలిసింది. దీంతో ప్రొఫెసర్ విద్యార్థులకు క్షమాపణ చెప్పడంతో పాటు మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు.
చాట్‌జీపీటీ అనేది ఓపెన్ ఏఐ(Open AI) డెవలప్ చేసిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ చాట్‌బాట్. ఇది రకరకాల కంటెంట్‌ను కూడా రాయగలదు. వివిధ భాషలను అనువదించగలదు. అంతేకాకుండా యూజర్లు అడిగే ప్రశ్నలకు సమాచారం రూపంలో సమాధానం ఇస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

