Poco X5 Pro 5G | మార్కెట్లోకి పొకో ఎక్స్5ప్రో 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్.. ధరెంతంటే?!
Poco X5 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ పొకో.. దేశీయ మార్కెట్లోకి పొకొ ఎక్స్5 ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరించింది.
Poco X5 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో.. దేశీయ మార్కెట్లోకి పొకో ఎక్స్ 5 ప్రో 5జీ ఫోన్ తీసుకొచ్చింది. అడ్రెనో 642ఎల్ జీపీయూతోపాటు ఒక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ఎస్వోసీ ప్రాసెసర్‌తో వస్తున్నది. ఎంఐయూఐ14 స్కిన్ ఆప్ టాప్‌తోపాటు ఆండ్రాయిడ్ 12 వర్షన్‌తో పని చేస్తుందీ ఫోన్. ఇందులో డ్యుయల్ (నానో) సిమ్ సామర్థ్యం ఉంటుంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ఎక్స్ఫినిటీ అమోల్డ్ డిస్ప్లే విత్ 120హెర్ట్జ్ అడాప్టివ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తున్నది. 900 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 108-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఫెసిలిటీ ఉంది. ఈ కెమెరాల్లో 30ఎఫ్‌పీఎస్ వద్ద 4కే వీడియోల రికార్డింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో పొకో ఎక్స్5 5జీ ఫోన్‌ను ఆవిష్కరించింది.
పొకో ఎక్స్5 ప్రో ఫోన్ రెండు మోడల్స్‌లో వస్తున్నది. బేస్ వేరియంట్ ఫోన్ 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీతో వస్తున్నది. 6జీబీ రామ్ కెపాసిటీ ఫోన్ రూ.22,999, 8జీబీ రామ్ సామర్థ్యం గల ఫోన్ రూ.24,999లకు లభ్యం అవుతాయి.
ఇవీ స్పెషిఫికేషన్లు.. ఫీచర్లు..
- 6.67 అంగుళాల ఎక్స్ఫినిటీ అమోల్డ్ డిస్ప్లే విత్ 120హెర్ట్జ్ అడాప్టివ్ రీఫ్రెష్ రేట్
- 900 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్.
- డిస్ప్లేలో 240-హెర్ట్జ్ టచ్ శాంపిల్ రేట్, హెచ్డీఆర్ 10 + సపోర్ట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
- 778జీ ఎస్వోసీ స్నాప్‌డ్రాగన్ విత్ అడ్రెనో 642ఎల్ జీపీయూ
- 8జీబీ ఆఫ్ ఎల్పీడీడీఆర్4 ఎక్స్ రామ్.. 256 ఆఫ్ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ కెపాసిటీ.
ట్రిపుల్ రేర్ కెమెరా ఆప్షన్స్
- 108-మెగా పిక్సెల్ ఐసోసెల్ హెచ్ఎం2 మెయన్ సెన్సర్.
- 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్.
- 2-మెగా పిక్సెల్ మాక్రో షూటర్.
- 30ఎఫ్‌పీఎస్ వద్ద 4కే వీడియోల రికార్డింగ్ సామర్థ్యం.
- సెల్ఫీల కోసం ఫ్రంట్‌లో 120ఎఫ్‌పీఎస్ వద్ద ఫుల్-హెచ్డీ వీడియోల రికార్డ్ కెపాసిటీ.
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం.
- 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 5వాట్ల వైర్ రివర్స్ చార్జింగ్ ఫెసిలిటీ.
- ఎంఐయూఐ 14 బేస్డ్ ఆండ్రాయిడ్ 12 వర్షన్‌పై పని చేస్తుంది.
- రెండేండ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్కు హామీ.. మూడేండ్ల పాటు సెక్యూరిటీ ప్యాచెస్.
- యూఎస్బీ టైప్-సీపోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ లభ్యం.
- డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1 వైర్లెస్ కనెక్ట్విటీ.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

