Oppo Find N2 Flip | ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వస్తోంది.. 15న ఆవిష్కరణ..!!
Oppo Find N2 Flip | చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో.. గ్లోబల్ మార్కెట్లోని ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తున్నది. ఈ నెల 15న ఆవిష్కరించనున్నది.
Oppo Find N2 Flip | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో ఈ నెల 15న ఆవిష్కరిస్తారు. దీంతోపాటు ఒప్పో ఫైండ్ స్మార్ట్ ఫోన్ కూడా ఇదే రోజు గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొస్తారు. ఇప్పటికే ఈ రెండు ఫోన్లను చైనాలో ఆవిష్కరించారు. ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోన్ క్లామ్‌షెల్ ఫోల్డబుల్ డిజైన్‌తో వస్తుంది. ఇది 6.8-అంగుళాల ప్రైమరీ ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లే, 3.62 అంగుళాల కవర్ డిస్ప్లేతో వస్తుంది. ఒప్పో స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 9000 + ఎస్వోసీ చిప్సెట్తో లభిస్తుంది.
ఈ నెల 15న గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరిస్తామని ఇటీవల ఓప్పో ట్వీట్ చేసినా.. దాని ధర ప్రకటించలేదు. అయితే 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ మోడల్ ఫోన్ దాదాపు రూ.1.07 లక్షలు (1200 యూరోలు) ఉంటుందని భావిస్తున్నారు. ఆస్ట్రల్ బ్లాక్, మూన్లిట్ పర్పుల్ కలర్స్‌లో లభిస్తుంది.
చైనా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫీచర్లే గ్లోబల్ మార్కెట్లోనూ లభిస్తాయని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ 13-బేస్డ్ కలర్ ఓఎస్ 13.0 వర్షన్‌తో పని చేస్తుంది. 6.8-అంగుళాల ప్రైమరీ ఫుల్-హెచ్డీ + ( 1,080×2,520 పిక్సెల్స్) అమోల్డ్ డిస్ప్లే విత్ 120 హెర్ట్జ్ అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 3.62 అంగుళాల కవర్ డిస్ప్లే విత్ 60 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ ఎస్వోసీ, కపుల్డ్ విత్ మాలి-జీ710 ఎంసీ10 జీపీయూతో రూపుదిద్దుకున్నదీ ఫోన్. ఒప్పో ఫైండ్ ఎన్2 ప్లిప్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 50 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సార్, 8-మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ కెమెరాతోపాటు సెల్ఫీ కోసం 32-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. టాప్‌లో ఫోల్డింగ్ డిస్ప్లేతో వస్తుంది. అంతేకాదు ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ మోడల్ ఫోన్ 44 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4300 ఎంఏహెచ్ డ్యుయల్ సెల్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఫేస్ అన్‌లాక్ టెక్నాలజీతోపాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

