OnePlus Nord 5 | భారీ బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో లాంచ్ అయిన వన్ ప్లస్ నార్డ్ 5 స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..?
ఫ్లాగ్షిప్ ఫోన్లలో ఉండే ఫీచర్లను మిడ్ రేంజ్ ఫోన్లలోనే అందిస్తూ వన్ ప్లస్ కంపెనీ ఎంతగానో పేరు గాంచింది. ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఫీచర్లను తన స్మార్ట్ ఫోన్ల ద్వారా యూజర్లకు అందిస్తూ వస్తోంది.
OnePlus Nord 5 | ఫ్లాగ్షిప్ ఫోన్లలో ఉండే ఫీచర్లను మిడ్ రేంజ్ ఫోన్లలోనే అందిస్తూ వన్ ప్లస్ కంపెనీ ఎంతగానో పేరు గాంచింది. ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఫీచర్లను తన స్మార్ట్ ఫోన్ల ద్వారా యూజర్లకు అందిస్తూ వస్తోంది. అందులో భాగంగానే తాజాగా మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను మిడ్ రేంజ్ సెజ్‌మెంట్‌లో రిలీజ్ చేసింది. నార్డ్ 5 పేరిట ఓ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్‌ను వన్ ప్లస్ కంపెనీ భారత్‌లో లాంచ్ చేసింది. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 6.83 ఇంచుల 1.5కె స్విఫ్ట్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లేపై చాలా క్వాలిటీ అయిన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేయగా, 12జీబీ ర్యామ్‌ను, 512జీబీ వరకు స్టోరేజ్‌ను అందిస్తున్నారు.
6 ఏళ్ల వరకు అప్డేట్స్..
ఈ ఫోన్లో ప్రత్యేకమైన కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్‌ను ఎంత తీవ్రంగా ఉపయోగించినా అంత హీట్‌కు గురవదు. ఇందులో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 15ను ఏర్పాటు చేశారు. దీనికి గాను 4 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ను, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని వన్ ప్లస్ తెలియజేసింది. ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేయగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను కూడా ఇచ్చారు. ముందు భాగంలో 50 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌కు గాను ప్రత్యేకంగా ప్లస్ కీని అందిస్తున్నారు. దీని సహాయంతో యూజర్లు సులభంగా పలు పనులు చేసుకోవచ్చు. సౌండ్, వైబ్రేషన్, డు నాట్ డిస్టర్బ్, ఏఐ టూల్స్ వంటి వాటిని ఈ కీ ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్లో 6800 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అందువల్ల ఫోన్ చాలా వేగంగా చార్జింగ్ అవుతుంది. 1 గంటలోనే 100 శాతం చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌కు గాను ఐపీ 65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. 8జీబీ, 12జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ మోడల్స్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లను అందిస్తున్నారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లు కూడా ఈ ఫోన్లో ఉన్నాయి.
ధర వివరాలు..
వన్‌ప్లస్ నార్డ్ 5 స్మార్ట్ ఫోన్‌ను మార్బుల్ శాండ్స్, డ్రై ఐస్ ఫాంటమ్ గ్రే కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.31,999 ఉండగా, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.34,999 గా ఉంది. టాప్ ఎండ్ 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.37,999గా ఉంది. ఈ ఫోన్‌ను అమెజాన్‌తోపాటు వన్ ప్లస్ ఆన్లైన్ స్టోర్, ఇతర రిటెయిల్ స్టోర్స్‌లో విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా కస్టమర్లు ఈ ఫోన్‌పై రూ.2000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను పలు బ్యాంకులకు చెందిన కార్డులతో పొందవచ్చు. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

