OnePlus 10 Pro | అద్భుతమైన ఫీచర్లతో వన్‌ప్లస్ 10 ప్రో లాంచ్.. ధరెంతో తెలుసా?
OnePlus 10 Pro | వన్‌ప్లస్ 10 ప్రో మోడల్ ఫోన్‌ను తాజాగా చైనా మార్కెట్లోకి కంపెనీ లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 10 ప్రో ఫోన్.. క్వాల్కామ్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ఎస్వోసీ ప్రాసెసర్‌తో నడవనుంది

OnePlus 10 Pro | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి సరికొత్త మోడల్ ఫోన్ లాంచ్ అయింది. వన్‌ప్లస్ 10 ప్రో మోడల్ ఫోన్‌ను తాజాగా చైనా మార్కెట్లోకి కంపెనీ లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 10 ప్రో ఫోన్.. క్వాల్కామ్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ఎస్వోసీ ప్రాసెసర్‌తో నడవనుంది. 120 హెచ్‌జెడ్ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, సెకండ్ జనరేషన్ లో టెంపరేచర్ పాలీక్రిస్టలైన్ ఆక్సైడ్ టెక్నాలజీతో ఈ ఫోన్ పనిచేస్తుంది. వన్‌ప్లస్ 10 ప్రోలో అత్యాధునికమైన ఫీచర్లను కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
చైనాలో ఈ ఫోన్ జనవరి 13 నుంచి లభిస్తుంది. జనవరి 13 నుంచి ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు ఈ ఫోన్ రిలీజ్ అవుతుందో మాత్రం వన్‌ప్లస్ చెప్పలేదు. మూడు వేరియంట్లలో రానున్న ఈ ఫోన్ బేసిక్ వేరియంట్(8జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ) ధర రూ.54,500, ఆ తర్వాత మోడల్ (8జీబీ ప్లస్ 256 జీబీ) వేరియంట్ ధర రూ.58,000, 12 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.61,500 గా నిర్ణయించారు.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1, 6.7 ఇంచ్ క్యూహెచ్డీ ప్లస్ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, 20.1.9 ఆస్పెక్ట్ రేషియో, డైనమిక్ రీఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్యానెల్, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 48 ఎంపీ సోనీ ఐఎంఎక్స్789 ప్రైమరీ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టబిలైజేషన్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 డబ్ల్యూ ఫ్లాష్ చార్జ్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ రిలీజ్ అయింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

