ప్రపంచంలో్నే అతి పెద్ద ఎన్ఎఫ్టీ మార్కెట్ ఓపెన్‌సీ హ్యాక్‌కు గురయింది. ఓపెన్‌సీపై ఫిషింగ్ అటాక్ జరగడం వల్ల.. ఇందులో ఎన్ఎఫ్టీలను లిస్ట్ చేసిన 32 మంది యూజర్లు తమ విలువైన ఎన్ఎఫ్టీలను కోల్పోయినట్టు ఓపెన్‌సీ ప్రకటించింది. 1.7 మిలియన్ డాలర్ల విలువైన ఎన్ఎఫ్టీలు హ్యాక్‌కు గురయ్యాయి. అంటే మన కరెన్సీలో సుమారు 13 కోట్ల రూపాయలు అన్నమాట.
అయితే.. ఈ హ్యాకింగ్ వల్ల సుమారు 200 మిలియన్ డాలర్ల విలువైన ఎన్ఎఫ్టీలు హ్యాక్ అయ్యాయని వార్తలు రావడంతో అదంతా అబద్ధం అని.. కేవలం 1.7 మిలియన్ డాలర్ల విలువై ఇథీరియం అటాకర్ వాలెట్లో ఉందని.. ఎన్ఎఫ్టీలను దొంగలించి వాటిని అమ్మడం ద్వారా వచ్చిన ఇథీరియం విలువ అది అని ఓపెన్‌సీ సీఈవో డెవిన్ ఫించర్ ప్రకటించారు.
ఓపెన్‌సీ ఇటీవలే కొత్త స్మార్ట్ కాంట్రాక్ట్ అప్‌గ్రేడ్‌ను ప్రకటించింది. కొత్త అప్‌గ్రేడ్ వల్ల.. ఓపెన్‌సీలో ఇన్ యాక్టివ్‌లో ఉన్న ఎన్ఎఫ్టీలు డీలిస్ట్ అవుతాయి. అందుకోసం యూజర్లు.. ఈటీహెచ్ ఇథీరియంలో తాము లిస్ట్ చేసిన ఎన్ఎఫ్టీలను కొత్త స్మార్ట్ కాంట్రాక్ట్‌కు బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది.