ఫేక్ యాప్స్ కు చెక్ పెట్టేందుకు కొత్త గైడ్ లైన్స్

హైదరాబాద్ ,మే 4: సాంకేతికత రోజురోజుకు అభివృద్ధి చెందడంతో కొత్త యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అదే అదనుగా వాటితో పాటు ఫేక్ యాప్స్ కూడాపుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఒరిజినల్ యాప్స్ ఏవో.. ఫేక్ యాప్స్ ఏవో తెలియని పరిస్థితి. అసలు వాటిని కనుక్కునేందుకు వీలు లేకుండా హ్యాకర్లు నకిలీ యాప్స్ ను సృష్టిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని స్పామ్ యాప్స్ కూడా తయారు చేస్తున్నారు. అలాంటి వాళ్లకు చెక్ పెట్టేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నది.
అందుకోసం గూగుల్ ప్లే స్టోర్ కొత్త గైడ్‌లైన్స్ తీసుకురానున్నది. ఈ గైడ్‌లైన్స్ 2021 చివరి నాటికి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు గూగుల్ తెలిపింది. యాప్ టైటిల్‌ను 30 క్యారెక్టర్లకు తగ్గిస్తుంది. అంతేకాదు యాప్ పనితీరును సూచించే కీ వర్డ్స్‌ను నిషేధిస్తుందట. ఐకాన్‌లో డెవలపర్ ప్రమోషన్ పేరును తొలగించనుంది. వినియోగదారులను తప్పుదారి పట్టించేలా యాప్ ఐకాన్‌పై ఇచ్చే గ్రాఫిక్స్‌ను కూడా నిషేధిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటుగా క్యాపిటల్ ఫాంట్స్ వాడకాన్ని, యాప్ పేరులో ఎమోజీలను వాడకూడదని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను పాటించని యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. లిస్టింగ్ ప్రివ్యూవ్‌కి సంబంధించి కూడా కొత్త ఎసెట్ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఆ యాప్‌ను యూజర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చా? లేదా? అనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని యాప్ డెవలపర్స్‌కు సూచించింది. అలాగే ప్రివ్యూవ్ ఎసెట్స్ కూడా జనాలకు అర్థమయ్యే విధంగా ఉండాలని గూగుల్ తెలిపింది. 2021 చివరి కల్లా ఈ గైడ్‌లైన్స్ అమల్లోకి వస్తాయని చెప్పింది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నది గూగుల్.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

