New Feature: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ‘అడ్మిన్ రివ్యూ’
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతుంది. ప్రస్తుతం వాట్సాప్ ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉంది.
న్యూఢిల్లీ: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతుంది. ప్రస్తుతం వాట్సాప్ ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉంది. కొత్త ఫీచర్‌ను ‘అడ్మిన్ రివ్యూ’ పేరుతో తీసుకురానుంది.
అయితే ఈ ఫీచర్ అందరికీ కాదు. కేవలం వాట్రాప్ గ్రూపు అడ్మిన్లు మాత్రమే ఉపయోగించేలా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ వల్ల వాట్సాప్ గ్రూపులలో సభ్యులకు ఇబ్బందులు కలిగించే మెసేజ్‌లను గ్రూప్ అడ్మిన్లు డిలీట్ చేయవచ్చు. ఎలా అంటే సాధారణంగా వాట్సాప్ గ్రూపుల్లో చాలా పెద్ద మొత్తంలో సమాచారం వచ్చి చేరుతుంటుంది. ఈ సమాచారం గ్రూపులో ఉన్న సభ్యులకు ఇబ్బందికరంగా అనిపించినా, ఒకవేళ ఆ సమాచారం తప్పుడు ఇన్ఫర్మేషన్ అని అనిపించినా సంబంధిత సమాచారం గురించి వాట్సాప్ గ్రూపు సభ్యులు డైరెక్ట్‌గా గ్రూపు అడ్మిన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. అప్పుడు ఆ మెసేజ్‌ను గ్రూపు నుంచి ఎవరికి కనిపించకుండా డిలీట్ చేసే అవకాశం గ్రూప్ అడ్మిన్‌కు ఉంటుంది. ఎవరైతే గ్రూపు సభ్యులు ఫిర్యాదు చేస్తారో వారి సమాచారం గ్రూపు అడ్మిన్‌కు మాత్రమే కనిపిస్తుంది.
ప్రయోగదశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం తీసుకురానున్నారు. ఈ కొత్త సదుపాయం వల్ల గ్రూపుల్లో షేర్ అయ్యే తప్పుడు సమాచారాన్ని నిరోధించడం సులభమవుతుంది. అంతేకాకుండా గ్రూపు సభ్యులకు ఇబ్బంది కలిగించే సమాచారాన్ని సైతం తగ్గించవచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

