Netflix | ఇక నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కాస్ట్లీ గురూ.. ఎంత పెరిగిందో తెలుసా?
Netflix | భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ధరలను భారీగా తగ్గించారు భారత్‌లో ఇదివరకు ఉన్న రూ.499 ప్లాన్‌ను రూ.199కి తగ్గించింది నెట్‌ఫ్లిక్స్. రూ.649 ఉన్న ప్లాన్‌ను రూ.499కి తగ్గించింది
Netflix | నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఇక నుంచి కొన్ని దేశాల్లో కాస్ట్లీ కానుంది. నిజానికి భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ధరలను భారీగా తగ్గించారు. కాకపోతే యూఎస్, కెనెడాలో మాత్రం పెంచారు. అక్కడ ప్లాన్ మీద కనీసం ఒకటి నుంచి రెండు డాలర్లను పెంచింది. ఇండియాలో మాత్రం ఇక్కడ ఉన్న ఓటీటీలతో పోటీ పడేందుకు, కొత్త సబ్స్క్రైబర్లను పెంచుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ల రేట్లను అమాంతం తగ్గించేసింది.

భారత్‌లో నెలవారి ప్లాన్ రూ.149 నుంచే ప్రారంభం అవుతోంది. అదే యూఎస్‌లో బేసిక్ ప్లాన్ నెలకు 9.99 డాలర్లతో ప్రారంభం అవుతుంది. ఆ ప్లాన్‌లో భాగంగా ఒక స్క్రీన్‌లో ఒకేసారి చూసే వీలు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ ప్లాన్ 14 డాలర్లను 15.50 డాలర్లకు పెంచింది. స్టాండర్డ్ ప్లాన్‌లో భాగంగా ఒకేసారి రెండు స్క్రీన్లలో నెట్‌ఫ్లిక్స్‌కు లాగిన్ అవ్వొచ్చు. 4కే రిజల్యూషన్ ప్లాన్ 20 డాలర్లకు పెరిగింది. అది ఇదివరకు 18 డాలర్లుగా ఉండేది. 4కే ప్లాన్‌లో ఒకేసారి నాలుగు స్క్రీన్లలో చూడొచ్చు.
అలాగే కెనెడాలో కూడా 14.99 కెనెడియన్ డాలర్లుగా ఉన్న బేసిక్ ప్లాన్ ధరను 16.49 కెనెడియన్ డాలర్లుగా పెంచింది. ప్రీమియం ప్లాన్‌లో కూడా రెండు డాలర్లు పెంచింది. బేసిక్ ప్లాన్ 9.99 కెనెడియన్ డాలర్లను మాత్రం నెట్‌ఫ్లిక్స్ మార్చలేదు.
భారత్‌లో ఇదివరకు ఉన్న రూ.499 ప్లాన్‌ను రూ.199కి తగ్గించింది నెట్‌ఫ్లిక్స్. రూ.649 ఉన్న ప్లాన్‌ను రూ.499కి తగ్గించింది. ప్రీమియం ప్లాన్ ఇదివరకు రూ.799 గా ఉండేది. ఇప్పుడు అది రూ.649 గా ఉంది. ప్రీమియం ప్లాన్‌లో 4కే రిజల్యూషన్‌తో పాటు హెచ్డీఆర్ క్వాలిటీ వీడియోలను వీక్షించవచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎక్కువ ఈఎంఐ కట్టడమా?.. కాల వ్యవది పెంచుకోవమా?.. ఆర్బీఐ వడ్డీరేటు పెంచిన తరువాత ఏది బెటర్
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

