Elon Musk-Twitter | ట్విట్టర్‌కు మస్క్ నాట్ సూటబుల్.. టెస్లాపై ఫోకస్ చేస్తే మేలు!
Elon Musk-Twitter | ఎలన్మస్క్పై ట్విట్టర్-టెస్లా ఇన్వెస్టర్ గెర్బర్ కవాసాకీ వెల్త్ మేనేజ్మెంట్ మండిపడింది. ట్విట్టర్‌కు మస్క్ సరిపోరన్నది.
Elon Musk-Twitter | ఎలన్‌మస్క్ వ్యవహారశైలిపై ట్విట్టర్-టెస్లాల్లో ఇన్వెస్టర్ గెర్బర్ కవాసాకీ వెల్త్ మేనేజ్మెంట్ హెడ్ రాస్ గెర్బర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ నిర్వహణకు ఎలన్‌మస్క్ సరిపోడని అన్నారు. దానికి బదులు టెస్లాపై దృష్టి పెడితే మంచిదని హితవు చెప్పారు. టేకోవర్ చేసిన ట్విట్టర్ మరమ్మత్తు పనులు చేయడానికి బదులు టెస్లా ఇంక్ బ్రాండ్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. కానీ, గెర్బర్ వ్యాఖ్యలపై ఎలన్‌మస్క్ వెటకారపు వ్యాఖ్యలు చేశారు.
వాణిజ్య ప్రకటనకర్తలు, మీడియా ప్రతినిధులతో సంప్రదింపులు జరిపేందుకు సంస్థ సీఈవోగా మీడియా సేవీ పర్సన్ కావాలని గెర్బర్ సూచించారు. గత సెప్టెంబర్ 30న టెస్లాలో గెర్బర్ సారధ్యంలోని వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీకి 3,90,100 షేర్లు ఉన్నాయి. ఇవి సంస్థలో 0.01 శాతం వాటా. టెస్లాలో దీర్ఘకాలిక ఇన్వెస్టర్‌గా ఉన్నారు.
ఈ ఏడాది తొలి నుంచి టెస్లా మార్కెట్ విలువ 60 శాతానికి పైగా పతనమైంది. ట్విట్టర్‌ను టేకోవర్ చేయడంతో టెస్లాలో ఎలన్‌మస్క్ తన షేర్లలో గణనీయ భాగం విక్రయించారు. స్టాక్స్ పతనం కావడంతో బోర్డు `టైం ఫర్ ఏ షేక్అప్` అయ్యే పరిస్థితి వచ్చిందని గెర్బర్ ఇటీవల ట్వీట్ చేశారు. తాజాగా గెర్బర్ ట్వీట్లతో ఎలన్‌మస్క్ ఘాటుగా రియాక్టయ్యారు. `వెనక్కి వెళ్లి మీరు రాసిన పాత సెక్యూరిటీస్ అనాలసిస్ 101 టెక్ట్స్‌బుక్` చదువుకోండంటూ రిప్లయ్ ఇచ్చారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

