Moto G86 Power 5G | భారీ బ్యాటరీ, వాటర్ రెసిస్టెన్స్‌తో లాంచ్ అయిన మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్.. ధర తక్కువే..!
వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రస్తుతం చాలా కంపెనీలు తక్కువ బడ్జెట్లోనే ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగిన స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే మోటోరోలా కూడా ఇదే కోవలో ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది.
Moto G86 Power 5G | వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రస్తుతం చాలా కంపెనీలు తక్కువ బడ్జెట్లోనే ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగిన స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే మోటోరోలా కూడా ఇదే కోవలో ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటో జి86 పవర్ 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ ను భారత్‌లో లాంచ్ చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందించడంతోపాటు ధర కూడా చాలా తక్కువగానే ఉంది. ఈ ఫోన్లో 6.67 ఇంచుల అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేయగా దీనికి 1.5కె రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. తెరపై అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 8జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు.
వాటర్, డస్ట్ రెసిస్టెన్స్..
ఈ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను కూడా ఇచ్చారు. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. దీనికి గాను 2 ఓఎస్ అప్డేట్స్ను, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌కు ఐపీ 68, ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ ఫోన్లో 6720 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఇదే దీనికి ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. దీనికి 33 వాట్ల టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తున్నారు.
మిలిటరీ గ్రేడ్ నాణ్యత..
ఈ ఫోన్లో 8జీబీ ర్యామ్ లభిస్తుంది. 128 జీబీ స్టోరేజ్ మోడల్లో లాంచ్ చేశారు. మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకునే సౌలభ్యం కల్పించారు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్ ను ఏర్పాటు చేశారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. యూఎస్బీ టైప్ సి ఆడియోకు సపోర్ట్‌ను అందిస్తున్నారు. స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ కూడా ఉంది. మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో ఈ ఫోన్‌ను రూపొందించారు. అందువల్ల కిందపడిన అంత సులభంగా ఈ ఫోన్ పగలదు. ఇందులో 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లను కూడా ఇందులో అందిస్తున్నారు.
ధర వివరాలు..
మోటో జి86 పవర్ 5జి స్మార్ట్ ఫోన్‌ను పాంటోన్ కాస్మిక్ స్కై, పాంటోన్ గోల్డెన్ సైప్రస్, పాంటోన్ స్పెల్ బౌండ్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన సింగిల్ వేరియెంట్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు మోటోరోలా ఇండియా ఆన్లైన్ స్టోర్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఆగస్టు 6 నుంచి విక్రయించనున్నారు. ఈ ఫోన్‌పై పలు ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన కార్డులతో రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.1000 అదనపు డిస్కౌంట్ ఇస్తారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

