హైదరాబాద్ : ప్రముఖ టెక్ జగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ ఆండ్రాయిడ్ కోసం విండోస్11 యాప్ ను విడుదల చేసింది. కొత్త విండోస్ 11 అప్డేట్ వినియోగదారులు తమ కంప్యూటర్లలో అమెజాన్ యాప్‌స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఆండ్రాయిడ్ యాప్ నేరుగా మైక్రోసాఫ్ట్ నుంచి అందుబాటులో లేవు. కొత్త అప్డేట్ టాస్క్‌బార్‌లోని వాతావరణ సమాచారం, అప్డేట్ చేసిన నోట్‌ప్యాడ్, అప్డేట్ చేసిన లేఅవుట్లతో కూడిన మీడియా ప్లేయర్ యాప్‌లు, అదనపు మానిటర్లలో తేదీ, సమయం వంటి ఫీచర్లను అందిస్తుంది.
యాప్‌లోని బిల్ట్-ఇన్ విండోస్ అప్డేట్ ఎంపిక ద్వారా వినియోగదారులందరికీ అప్డేట్కానున్నాయి. వినియోగదారులు తమ విండోస్11 డివైస్ లో అమెజాన్ ఆప్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత అమెజాన్ ఖాతాతో సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది.