world’s Largest Power Bank | 2 కోట్ల 70 లక్షల ఎంఏహెచ్ కెపాసిటీతో ప్రపంచంలోనే అతి పెద్ద పవర్ బ్యాంక్ ఇది
world’s Largest Power Bank | ఈరోజుల్లో అందరికీ ఉండే ఒకే ఒక కామన్ ప్రాబ్లమ్ సెల్‌ఫోన్ చార్జింగ్. ఇంట్లో ఉన్నప్పుడు సెల్‌ఫోన్ చార్జింగ్ వల్ల పెద్ద సమస్య ఉండదు కానీ.. ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు మాత్రం సెల్‌ఫోన్ చార్జింగ్‌తో పరేషాన్ అవుతుంది. పవర్ బ్యాంకులు తీసుకెళ్లినా ఫోన్‌కు కావాల్సిన చార్జింగ్ పెట్టుకోలేం. ఒక్కసారి పెట్టుకుంటే పవర్ బ్యాంక్ కూడా డెడ్ అయిపోతుంది. బయటికెళ్లినప్పుడు, ఒక వేళ ఇంట్లో కరెంట్ లేని సమయంలో సెల్‌ఫోన్, లాప్టాప్ లాంటి వాటికి చార్జింగ్ ఎలా పెట్టుకోవాలి. అటువంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు చైనాకు చెందిన జెంగ్ ఒక సొల్యూషన్ చూపించాడు.
అదే 2 కోట్ల 70 లక్షల ఎంఏహెచ్ కెపాసిటీతో తయారు చేసిన ప్రపంచంలో అతి పెద్ద పవర్ బ్యాంక్. ఇంత పెద్ద పవర్ బ్యాంక్‌ను మీరు ఎక్కడా చూసి ఉండరు. సాధారణంగా ఒక స్మార్ట్‌ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ కెపాసిటీతో బ్యాటరీ ఉంటుంది. కానీ.. ఇది మాత్రం 2 కోట్ల 70 లక్షల ఎంఏహెచ్ కెపాసిటీని కలిగి ఉండటంతో దీనికి ఒకేసారి 5000 ఫోన్లను చార్జ్ చేసుకోవచ్చు.
ఫోన్లు, లాప్‌టాప్‌లతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్లకు కూడా ఈ పవర్ బ్యాంక్‌తో చార్జింగ్ చేయొచ్చు. అలాగే టీవీ, వాషింగ్ మెషిన్ లాంటివి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మొత్తానికి ఎలక్ట్రిసిటీ అవసరం లేకుండా ఈ పవర్ బ్యాంక్‌ను ఉపయోగించుకునేలా జెంగ్ దీన్ని తయారు చేశాడు.
దాన్ని ఎలా తయారు చేశాడో.. దానికి సంబంధించిన వీడియోను కూడా జెంగ్ తన యూట్యూబ్ అకౌంట్లో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

