Lenovo Tab P11 | అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఎలక్ట్రానిక్స్ సంస్థ లెనోవో.. భారత్‌లో తన మార్కెట్ విస్తరించాలని నిర్ణయించింది. అందుకోసం తొలి 5జీ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 650 5జీ ప్రాసెసర్‌తో రూపుదిద్దుకున్న లెనోవో టాబ్ పీ11 5జీ.. 11 అంగుళాల డిస్ప్లేఓ వస్తున్నది.
రెండు స్టోరేజీ ఆప్షన్లతో లెనోవో ట్యాబ్ పీ11 వచ్చింది. 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.29,999లకు, 256 జీబీ వేరియంట్ రూ.34,999లకు లభ్యం అవుతుంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, లెనోవో అధికారిక స్టోర్లలో ఈ టాబ్లెట్ కొనుగోలు చేయొచ్చు. షియోమీ ప్యాడ్-5, రియల్ మీ ప్యాడ్-ఎక్స్ మిడ్ రేంజ్ 5జీ టాబ్లెట్లతో లెనోవో పీ11 పోటీ పడుతుంది. షియోమీ ప్యాడ్-5 రూ.26,999, రియల్మీ ప్యాడ్-ఎక్స్ రూ.25,999లకు అందుబాటులో ఉన్నాయి.
11 అంగుళాల 2కే డిస్‌ప్లేతోపాటు 2000×1200 రిజొల్యూషన్‌తో లెనోవో ట్యాబ్ పీ11 లభిస్తుంది. 60హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ వద్ద డోల్బై విజన్ సపోర్ట్‌తో ఐపీఎస్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్-11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. టాబ్లెట్లు, ఫోల్డబుల్ డివైజ్‌లకు ఆండ్రాయిడ్-12ఎల్, గూగుల్ కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. ప్రిసిషన్ పెన్ 2 స్టైలస్, కీబోర్డులతో కూడా లెనోవో ట్యాబ్ పీ11 వస్తుంది. అయితే ప్రిసిషన్ పెన్ 2 స్టైలస్, కీ బోర్డులను విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఆటో ఫోకస్ ఫీచర్‌తో లెనోవో ట్యాబ్ పీ11 5జీ టాబ్లెట్‌లో 13 ఎంపీ కెమెరా సెన్సర్ ఉంటుంది. ఫ్రంట్ భాగంలో టైమ్ ఆఫ్ ఫ్లైట్ (టీవోఎఫ్) ఫీచర్‌తో 8 ఎంపీ కెమెరా వస్తుంది. 3డీ ఇమేజింగ్ కూడా పొందొచ్చు.
7700 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్న లెనోవో ట్యాబ్ పీ11 5జీ టాబ్లెట్‌లో జేబీఎల్-పవర్డ్ స్పీకర్స్, డోల్బీ అట్మోస్ సపోర్ట్ వస్తాయి. 20వాట్ల చార్జింగ్ అడాప్టర్ కూడా అందుకోవచ్చు. ఇందులో 12 గంటల వరకు ప్లేబ్యాక్ టైం కెపాసీటీ ఉంటుంది. బ్లూ టూత్ 5.1, వై-ఫై6, యూఎస్బీ-సీ 3.2 జన్1 వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.