Lava Bold N1 | రూ.12 వేలకే లావా నుంచి కొత్త 5జీ ఫోన్.. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో అదిరే ఫీచర్లు
Lava Bold N1 | దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ తక్కువ బడ్జెట్లోనే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. Lava Bold N1 5జీ మోడల్‌కు కొత్త వేరియంట్ తీసుకొచ్చింది.
Lava Bold N1 | దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ తక్కువ బడ్జెట్లోనే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. Lava Bold N1 5జీ మోడల్‌కు కొత్త వేరియంట్ తీసుకొచ్చింది. గత ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్ 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇప్పుడు వీటికి అప్‌గ్రేడ్‌గా 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది.
ధర కూడా తక్కువే!
కొత్తగా తీసుకొచ్చిన 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.12,999గా లావా ఇంటర్నేషనల్ కంపెనీ నిర్ణయించింది. లాంచ్ ఆఫర్లో భాగంగా రూ.వెయ్యిపైనే డిస్కౌంట్ కూడా అందించనుంది. ఈ ఫోన్ షాంపైన్ గోల్డ్, రాయల్ బ్లూ కలర్ ఆప్షన్లో వస్తుంది.
బడ్జెట్ ధరలోనే!
మే 1వ తేదీ నుంచి ఈ మొబైల్ ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. ఇక ఇప్పటికే మార్కెట్లో ఉన్న 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.7499, రూ.7999గా ఉన్నాయి.
ఫీచర్లు – స్పెసిఫికేషన్లు
Lava Bold N1 5జీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌పై పనిచేస్తుంది. ఇది 6.75 అంగుళాల హెచ్డీ + డిస్ప్లేతో పాటు 90Hz రీఫ్రెస్ రేటుతో వస్తుంది. 2.5D గ్లాస్ ప్రొటెక్షన్, 20:9 అస్పెక్ట్ రేషియో ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇది Unisoc T765 ఆక్టా కోర్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ కొత్త వేరియంట్లో 6జీబీ ర్యామ్ ఉండగా.. వర్చువల్ ర్యామ్ సాయంతో 12జీబీ వరకు పెంచుకునే సదుపాయం కల్పించారు. ఇక స్టోరేజ్‌ను 1టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
కెమెరా ఫీచర్లు
ఈ మొబైల్లో వెనుక భాగంలో 13మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన డ్యుయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 5మెగా పిక్సెల్ కెమెరా అందించారు. IP 54 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలదు.
బ్యాటరీ, ఇతర స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ 5000mAh సామర్థ్యంతో కూడిన బ్యాటరీతో వస్తుంది. ఇది 10W చార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఇందులో 5జీ, వైఫై, బ్లూటూత్, ఓటీజీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కలవు. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

