Koo app | ట్విట్టరీలకు ‘కూ’ బంపర్ ఆఫర్..
Koo Bumper Offer | ట్విట్టరీలకు కూ యాప్ బంపరాఫర్ ఇచ్చింది. బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ చార్జీ వసూలు చేయబోమని తేల్చేసింది.
Koo Bumper Offer | ప్రజల అభిప్రాయాలను వెల్లడించే సోషల్ మీడియా వేదికల్లో ఒకటి ట్విట్టర్.. అది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. టెస్లా సీఈవో ఎలన్‌మస్క్.. సొంతమైంది. ఈ తరుణంలో ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న దేశీయ సోషల్ మీడియా యాప్ ‘కూ’ యాప్.. ట్విట్టరీలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఉచితంగా సేవలందిస్తామని ప్రకటించింది.
సబ్స్క్రిప్షన్లతో ఇన్‌కం పెంచుకోవాలని తల పెట్టాడు ఎలన్ మస్క్. అందుకోసం ట్విట్టర్ బ్లూ టిక్. . వెరిఫికేషన్ బ్యాడ్జ్ ఉన్న ఖాతాలు.. ఈ ఖాతాలకు సబ్స్క్రిప్షన్ పెట్టి.. నెలకు 20 డాలర్లు.. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.1600 సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు చేయ సంకల్పించినట్లు వార్తలొచ్చాయి. ఎలన్‌మస్క్ ట్విట్టర్ బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ వార్త సోషల్ మీడియాలో వైరలవుతున్నది.
ఈ తరుణంలో దేశీయ ట్విట్టర్‌గా పరిగణిస్తున్న ‘కూ’ యాప్.. ట్విట్టరీలకు బంపరాఫర్ ఇచ్చింది. ఉచితంగా సేవలందిస్తామని సంస్థ కో-ఫౌండర్ కం సీఈవో అప్రమేయ రాధాకృష్ణ ట్వీట్ చేశారు. ట్విట్టరీలను తక్షణం ‘కూ’ యాప్‌లోకి మారండి అనే సంకేతమిస్తూ .. #SwitchtoKoo’ అనే హ్యాష్‌టాగ్ జత చేశారు.
బ్లూటిక్ ఖాతాల సబ్‌స్క్రిప్షన్‌తో ఆదాయం పెంచుకోవాలని చూస్తున్న ఎలన్‌మస్క్ యోచనను తమ యాప్ విస్తరణకు అనుకూలంగా మార్చుకోవాలని కూ భావిస్తున్నట్లు తలుస్తున్నది. ప్రధాని నరేంద్రమోదీ ఆత్మ నిర్భర్ భారత్ పిలుపు మేరకు 2020లో ‘కూ’ యాప్ ఏర్పాటైంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

