సౌరకుటుంబంలో అతిపెద్ద చందమామని చూశారా.. ఇదీ తొలి ఫొటో

వాషింగ్టన్: సౌరకుటుంబంలో భూమికి ఉన్నట్లే ప్రతి గ్రహానికి చందమామ ఉంటాడని తెలుసు కదా. అందులో కొన్నింటికి ఒకటి కంటే ఎక్కువ కూడా ఉంటాయి. వీటిలో గురు గ్రహానికి సౌరకుటుంబంలోనే అతిపెద్ద చందమామ ఉన్నాడు. దాని పేరు గానిమీడ్. నాసాకు చెందిన జునో స్పేస్‌క్రాఫ్ట్ ఇప్పుడా చందమామ ఫొటో తీసి భూమిపైకి పంపించింది. గానిమీడ్ ఉపరితలానికి వెయ్యి కిలోమీటర్ల దగ్గరి వరకూ వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్ అద్భుతమైన ఫొటోలు తీసింది. గత రెండు దశాబ్దాల్లో ఈ చందమామకు ఇంత దగ్గరగా వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్ మరొకటి లేదు.
జునో తీసిన హైరెజల్యూషన్ ఫొటోలను నాసా పరిశీలిస్తోంది. అందులో అగ్నిపర్వత బిలాలు కూడా కనిపిస్తున్నాయి. జునోను పరిశీలిస్తున్న స్కాట్ బోల్టన్ స్పందిస్తూ.. జూపిటర్ ఆర్బిటర్‌లోని జునోక్యామ్ ఇమేజర్, స్టెల్లార్ రెఫరెన్స్ యూనిట్ స్టార్ కెమెరా ఈ ఫొటోలు తీశాయి. నీటిరూపంలో ఉన్న మంచుతో కూడిన ఓ భాగం మొత్తాన్నీ జునో ఫొటో తీయగలిగినట్లు నాసా వెల్లడించింది. ఈ ఫొటోను జూన్ 7న గానిమీడ్ దగ్గరగా వెళ్లిన సమయంలో జునో తీసింది.
గురుగ్రహానికి ఉపగ్రహమైన ఈ గానిమీడ్.. బుధ గ్రహం కూడా పెద్దగా ఉంటుంది. స్పేస్‌క్రాఫ్ట్ సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉన్న గానిమీడ్ వైపు ఫొటో తీసింది. రానున్న రోజుల్లో స్పేస్‌క్రాఫ్ట్ మరిన్ని ఫొటోలు తీసి పంపించనుంది. ఈ ఫొటోల వల్ల గానిమీడ్ గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయని నాసా సైంటిస్టులు తెలిపారు. గురు గ్రహం చుట్టూ కొంత కాలంగా జునో స్పేస్‌క్రాఫ్ట్ తిరుగుతూనే ఉంది. 2011లో లాంచ్ చేయగా.. 2016లో ఇది గురుగ్రహ కక్ష్యలోకి చేరింది.

Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

