itel Magic 2 4G:మొబైల్ కంపెనీ ఐటెల్ అద్భుత ఫీచర్లు, అతి తక్కువ ధరలో కొత్త ఫీచర్ ఫోన్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. ఐటెల్ మ్యాజిక్ 2 4G పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యూయల్ 4జీ VoLTE సపోర్ట్‌తో ఈ ఫోన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ ప్రకటించింది. దీని ధర రూ.2,349గా నిర్ణయించారు. మ్యాజిక్ 2 4జీ సూపర్ ఫోన్లో వైఫై, హాట్‌స్పాట్ టెథరింగ్ ఉన్నాయి. దీంతో 8 డివైజ్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు.
కొత్త ఫోన్ బ్లాక్, బ్లూ కలర్లలో అందుబాటులో ఉంటుంది. 1900mAh బ్యాటరీతో 24 రోజుల స్టాండ్‌బై టైం కలిగి ఉంటుంది. 4జీ ఫీచర్ ఫోన్ తొమ్మిది ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 2,000 వరకు కాంటాక్టులను స్టోర్ చేసుకోవచ్చు. ఐటెల్ మ్యాజిక్ 2 ఫోన్ కొనుగోలు చేసిన వారికి 100 రోజుల పాటు రిప్లేస్మెంట్ వారంటీ, 12 నెలల గ్యారంటీ, కొనుగోలు చేసిన 365 రోజుల్లోపు స్క్రీన్ పగిలితే వన్‌టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ ఉంది.
India mein Superhero wali entry kar raha hai itel Magic 2 4G Superphone with Wi-Fi Tethering! Make life SAHI with Dual 4G SIM WiFi, King Voice and 1900 mAh big battery. Ab Smartphone wali internet speed itel Magic 2 superphone par paiye, aur life SAHI banaiye! #itelHaiLifeSAHIhai pic.twitter.com/V14Xpi9tug
— itel India (@itel_india) June 15, 2021