ISRO | మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. రేపు నింగిలోకి ఎన్వీఎస్-1 శాటిలైట్
ISRO | భారతీయ అంతరక్షి పరిశోధనా సంస్థ (ISRO) మరో మరో ప్రయోగానికి సిద్ధమైంది. నావిగేషన్ శాటిలైట్ ఎన్వీఎస్-1ను సోమవారం నింగిలోకి పంపనున్నది. గతంలో నావిగేషన్ సర్వీసెస్ కోసం పంపిన ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాల్లో నాలుగింటికి జీవితకాలం ముగిసింది.
ISRO | భారతీయ అంతరక్షి పరిశోధనా సంస్థ (ISRO) మరో మరో ప్రయోగానికి సిద్ధమైంది. నావిగేషన్ శాటిలైట్ ఎన్వీఎస్-1ను సోమవారం నింగిలోకి పంపనున్నది. గతంలో నావిగేషన్ సర్వీసెస్ కోసం పంపిన ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాల్లో నాలుగింటికి జీవితకాలం ముగిసింది. ఆ సిరీస్‌లో భాగంగానే ఈ ఎన్వీఎస్ ఉపగ్రహ ప్రయోగం చేపట్టనున్నది. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్ (NavIC) ఇస్రో అభివృద్ధి చేసిన ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇది కక్ష్యలో ఉన్న ఏడు ఉపగ్రహాల సమూహం కాగా.. ఇది గ్రౌండ్ స్టేషన్లతో కలిసి పని చేస్తుంది.
నెట్వర్క్ సాధారణ వినియోగదారులు, వ్యూహాత్మక వినియోగదారులకు నావిగేషనల్ సేవలను అందిస్తుంది. సాయుధ దళాలు, మెరుగైన పొజిషనింగ్, నావిగేషన్ అండ్ టైమింగ్ కోసం దేశంలో పౌర విమానయాన రంగానికి పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థ అభివృద్ధి ఇస్రో అభివృద్ధి చేసింది. రెండో తరం నావిగేషన్ శాటిలైట్ సిరీస్‌లో NVS-1 మొదటిదని ఇస్రో తెలిపింది. ఇది లెగసీ NavIC సేవల కొనసాగింపును నిర్ధారిస్తుందని, Li బ్యాండ్‌లో కొత్త సేవలను అందించనున్నది.
ఈ శాటిలైట్‌ను సోమవారం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో ప్యాడ్ నుంచి నింగిలోకి పంపనుండగా.. జీఎస్ఎల్వీ మోసుకెళ్లనున్నది. సోమవారం ఉదయం 10.42 గంటలకు ప్రయోగం చేపట్టనుండగా.. ఇవాళ ఉదయం 7గంటల 12నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. 27గంటల 30 నిమిషాల పాటు నిరంతరాయంగా కౌంట్‌డౌన్ కొనసాగనుంది. 2,232 కిలోల ఎన్వీఎస్–01 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. జీఎస్ఎల్వీ-ఎఫ్12 ప్రయోగం సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో పూజలు చేశారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

