ఐఫోన్ 14పై హాట్ డీల్ : యాపిల్ స్టోర్‌లో రూ . 12,000 డిస్కౌంట్
ఐఫోన్ 14 సిరీస్‌పై యాపిల్ భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 14 128జీబీ రిటైల్ ధర రూ .79,900 కాగా యాపిల్ స్టోర్‌లో రూ .7000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తుండగా దీనికి అదనంగా పాత ఐఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 5000 వరకూ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
న్యూఢిల్లీ : ఐఫోన్ 14 సిరీస్‌పై యాపిల్ భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 14 128జీబీ రిటైల్ ధర రూ .79,900 కాగా యాపిల్ స్టోర్‌లో రూ .7000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తుండగా దీనికి అదనంగా పాత ఐఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 5000 వరకూ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 14తో పాటు ఐప్యాడ్, మ్యాక్‌బుక్, యాపిల్ వాచ్ వంటి ఇతర కంపెనీ ఉత్పత్తులపైనా యాపిల్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది.
యాపిల్ ఆన్లైన్ స్టోర్‌లో డిస్కౌంట్‌పై ఐఫోన్ 14 రూ. 71,111కి లిస్టవగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుదారులకు రూ. 4000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఐఫోన్ 14 ధర రూ . 67,111కి దిగివస్తుంది. క్యాషిఫై పై కస్టమర్లు తమ పాత ఫోన్‌ను విక్రయిస్తే మరిన్ని డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. పాత ఫోన్ల ఎక్స్ఛేంజ్ విషయానికి వస్తే మెరుగైన బ్యాటరీ కలిగిన ఫోన్లకు, స్క్రాచ్‌లు లేని ఫోన్లకు డిస్ప్లేలో కంటే అధిక ధరను అందిస్తున్నారు.
యాపిల్ ఐఫోన్ 14 ఫీచర్లను పరిశీలిస్తే 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో హెచ్డీఆర్ సపోర్ట్ డిస్ప్లేతో ఈ ఫోన్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఐఫోన్ 14 ఏ15 బయోనిక్ చిప్‌తో లేటెస్ట్ స్టేబుల్ ఐఓఎస్ 16 వెర్షన్‌పై రన్ అవుతుంది. కెమెరా ఫీచర్లను చూస్తే 12ఎంపీ వైడ్‌యాంగిల్ సెన్సర్, సెన్సర్ షిఫ్ట్ ఓఐఎస్‌తో 12ఎంపీ అల్ట్రా వైడ్‌యాంగిల్ షూటర్‌ను కలిగిఉంది. వీడియో రికార్డింగ్ కోసం డాల్బీ విజన్‌ను సపోర్ట్ చేస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

