న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ కొనసాగుతుండగా పలు డివైజ్‌లపై డిస్కౌంట్లు, హాట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారితో పాటు యాపిల్ ప్రీమియం ఐఫోన్స్పైనా తాత్కాలికంగా ధరల తగ్గింపు వెసులుబాటు ఉంది.
ఐఫోన్ 14పై రూ. 1000 తగ్గింపు అందుబాటులో ఉండగా ఐఫోన్ 13పై రూ . 8000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. వీటికి తోడు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్తో ప్రీమియం ఐఫోన్లను ఆకర్షణీయ ధరల్లో సొంతం చేసుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 21న ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ముగుస్తుంది.
ఇక ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 13 (128జీబీ) ఎంఆర్పీ రూ. 69,900 కాగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ . 62,999కి విక్రయిస్తున్నారు. అదనంగా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం ఆఫర్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు కలిగిన కస్టమర్లు ఆర్డర్‌పై 5 శాతం ఆఫర్ పొందుతారు. ఇక పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్పై కస్టమర్లు రూ . 17,500 వరకూ లభిస్తుంది. ఐఫోన్ 13 రెడ్, బ్లూ, ఆలివ్ గ్రీన్, బ్లాక్, పింక్, వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.