న్యూయార్క్ : ఈ ఏడాది లాంఛ్ కానున్న ఐఫోన్ 14 సిరీస్ ఫ్రంట్ కెమెరాలో కీలక అప్‌గ్రేడ్స్ ఉంటాయని ప్రముఖ టెక్ అనలిస్ట్ మింగ్ చి కూ అంచనా వేస్తున్నారు. రానున్న ఐఫోన్ 14 ఫ్రంట్ కెమెరా లేటెస్ట్ 6పీ లెన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఐఫోన్ 14 ఫ్రంట్ కెమెరా కోసం ఆటో ఫోకస్ సపోర్ట్‌ను యాపిల్ ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఐఫోన్ 13 సిరీస్ ఫిక్స్డ్ ఫోకస్ ఫ్రంట్ కెమెరాను కలిగిఉండగా ఆటో ఫోకస్ సపోర్ట్ అందుబాటులోకి వస్తే సబ్జెక్ట్‌ను ఫ్రంట్ కెమెరా మెరుగ్గా ట్రాక్ చేయడంతో పాటు ఇమేజ్ను క్లిక్ చేసే ముందు ఫోకస్‌ను లాక్ చేస్తుంది.దీంతో షార్పర్, డిటెయిల్డ్ అవుట్‌పుట్‌ను రాబట్టవచ్చు.
ఫ్రంట్ కెమరా 6పీ లెన్స్‌తో ఉంటుందని కూ ఐఫోన్ 14 కెమెరా అప్‌గ్రేడ్స్‌పై అంచనాలు పెంచారు. దీంతో మెరుగైన ఫోటోలు తీసేందుకు వెసులుబాటు కలుగుతుంది. అయితే ఇప్పటికే షియోమి, వివో వంటి ఇతర బ్రాండ్లు 6పీ లెన్స్‌ను వాడుతున్నాయి. ఇక అప్‌గ్రేడెడ్ ఫ్రంట్ కెమెరా కేవలం ఐఫోన్ 14 ప్రొ మోడల్స్‌కే పరిమితమా అనే వివరాలను కూ వెల్లడించలేదు. వనిల్లా ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్ కూడా 6పీ ఫ్రంట్ కెమెరా సెటప్‌తో ముందుకొస్తాయని భావిస్తున్నారు.
ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ అప్‌గ్రేడెడ్ రియర్ కెమెరాతో ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. వెనుకభాగంలో లిడార్ సెన్సర్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇక మెయిన్ 48ఎంపీ కెమెరా 8కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది ఐఫోన్ 13 ప్రొ మెయిన్ కెమెరా కంటే 57 శాతం పెద్దదని చెబుతున్నారు. ఇక 12ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపీ టెలిఫోటో కెమెరా కూడా ఆకర్షణగా నిలువనున్నాయి.