యాపిల్ కీలక నిర్ణయం : 2023లోనూ నియామకాల నిలిపివేత!
టెక్ దిగ్గజం వచ్చే ఏడాది కూడా హైరింగ్ నిలిపివేయాలని యోచిస్తోంది. ప్రతికూల ఆర్ధిక పరిస్ధితులపై ఆందోళనతో కంపెనీ నియామక ప్రక్రియను నిలిపివేసిందని ఓ వాణిజ్య పత్రిక కధనం వెల్లడించింది.
న్యూయార్క్ : టెక్ దిగ్గజం వచ్చే ఏడాది కూడా హైరింగ్ నిలిపివేయాలని యోచిస్తోంది. ప్రతికూల ఆర్ధిక పరిస్ధితులపై ఆందోళనతో కంపెనీ నియామక ప్రక్రియను నిలిపివేసిందని ఓ వాణిజ్య పత్రిక కధనం వెల్లడించింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ ఏడాది హైరింగ్‌ను నిలిపివేసిన యాపిల్ 2023లోనూ హైరింగ్ ప్రణాళికలను నిలిపివేయాలని భావిస్తోంది.
రాబోయే కొద్ది నెలల్లో కొత్తగా ఎవరినీ విధుల్లోకి తీసుకోవడం లేదని కంపెనీ ఇప్పటికే పలు విభాగాధిపతులకు స్పష్టం చేసినట్టు సమాచారం. సెప్టెంబర్ 2023తో ముగిసే ఆర్ధిక సంవత్సరం వరకూ హైరింగ్ నిలిపివేతను పొడిగించాలని కంపెనీ నిర్ణయించినట్టు తెలిసింది.
రాబోయే ఏడాదిలో అదనంగా తీసుకునే సిబ్బందికి అవసరమైన బడ్జెట్ లేకపోవడంతోనే నియామకాల ప్రక్రియను యాపిల్ నిలిపివేసిందని చెబుతున్నారు. ఆర్ధిక పరిస్ధితులకు అనుగుణంగా వాణిజ్య విభాగాల్లో హైరింగ్‌పై ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని యాపిల్ ప్రతినిధి పేర్కొన్నారు. దీర్ఘకాలంలో యాపిల్ భవిష్యత్ పట్ల తాము ఆశాభావంతో ఉన్నామని ఆ దిశగా వినూత్న ధోరణిలో తెలివైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళతామని చెప్పుకొచ్చారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Apple
- hiring
- technology news
RELATED ARTICLES
తాజా వార్తలు
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

