Ekincare : Google Startups Accelerator programme కు సెలెక్ట్ అయిన హైదరాబాద్ స్టార్టప్ ఎకిన్కేర్
గూగుల్ ఇండియాలో Startups Accelerator programmeను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా.. పలు రంగాలకు చెందిన కొన్ని స్టార్టప్‌లను సెలెక్ట్ చేసి వాటికి మూడు నెలల పాటు గూగుల్ పలు రకాలుగా సపోర్ట్‌ను అందించనుంది. సెలెక్ట్ అయిన ఇండియాకు చెందిన 16 కంపెనీలలో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ఎకిన్కేర్ కూడా ఉంది.

ఈ ప్రోగ్రామ్ కోసం గూగుల్‌కు 700 వరకు అప్లికేషన్లు రాగా.. వాటన్నింటినీ స్క్రీనింగ్ చేసి చివరకు 16 కంపెనీలను గూగుల్ ఎంపిక చేసింది. అందులో ఎకిన్కేర్ ఒకటి. సామాజిక, ఆర్థిక వ్యవస్థలో చాలెంజింగ్ ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న స్టార్టప్ కంపెనీలనే ప్రాతిపదికగా తీసుకొని గూగుల్ సెలెక్ట్ చేసింది.
ఎకిన్కేర్ అనేది.. కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే కార్పొరేట్ హెల్త్ బెనిఫిట్స్ ప్లాట్‌ఫామ్. ఇది అన్నింటికీ ఒక వర్చువల్ కేర్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తుంది.
ప్రస్తుతం పలు స్టార్టప్ కంపెనీలు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషిన్ లర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించి.. పలు సమస్యలను, చాలెంజ్‌లను పరిష్కరిస్తున్నాయి. ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్న స్టార్టప్ కంపెనీలకు.. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా.. గూగుల్ మెంటర్‌షిప్‌ను అందిస్తుంది. క్లౌడ్, యూజర్ ఎక్స్‌పీరియెన్స్, ఆండ్రాయిడ్, వెబ్, ప్రాడక్ట్ స్ట్రాటజీ, మార్కెటింగ్ లాంటి వాటిపై గూగుల్ నుంచి కంపెనీలకు సపోర్ట్ లభిస్తుంది.

ఇండియాలో ఉన్న ఉద్యోగులందరికీ.. హెల్త్ కేర్ అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం మేము ఇండియాలో 400 కంటే ఎక్కువ కంపెనీలతో టైఅప్ అయ్యాం. ప్రస్తుతం 10 లక్షల కంటే ఎక్కువ మంది ఉద్యోగుల, వాళ్ల కుటుంబాల హెల్త్ కేర్‌ను మేమే చూసుకుంటున్నాం.. అని ఎకిన్కేర్ కంపెనీ సీఈవో కిరణ్ కలకుంట్ల వెల్లడించారు.
డిజిటల్ హెల్త్ అసిస్టెంట్, ఏఐ మోడల్ ఉపయోగించి.. హెల్త్ కేర్ డేటాను మేము కలెక్ట్ చేస్తాం. ఆ డేటాను ఉపయోగించి.. వ్యక్తిగతంగా ఒక ఉద్యోగికి ఎటువంటి హెల్త్ కేర్‌ను అందించగలమో దానిపై కృషి చేస్తాం. గూగుల్ ప్రోగ్రామ్‌లో సెలెక్ట్ అవ్వడం వల్ల.. గూగుల్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టీమ్‌తో మాకు వర్క్ చేసే అవకాశం లభించింది. ఇందులోనే ఇంకా బెస్ట్ మోడల్స్‌ను తయారు చేస్తాం.. అని కిరణ్ తెలిపారు.
ఎకిన్కేర్ కంపెనీ 2014 లో హైదరాబాద్‌లో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం తమ హెల్త్ బెనిఫిట్స్ ప్లాట్ఫామ్లో భాగంగా… టెలిమెడిసిన్, ఫార్మసీ, మెంటల్ హెల్త్, ఫిట్నెస్ సర్వీస్‌లను అందిస్తోంది.
మూడు నెలల మెంటర్షిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా… గూగుల్ టీమ్‌తో యాక్సెస్, ప్రాజెక్టుల మీద టెక్నికల్ గైడెన్స్, మిషిన్ లర్నింగ్ సపోర్ట్, డిజైన్, నెట్వర్కింగ్ సపోర్ట్ గూగుల్ నుంచి లభించనుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

