Alasca | అలస్కాలో చిక్కుకున్న వ్యక్తి.. ఐ ఫోన్ 14 సాస్ ఎమర్జెన్సీ అలర్ట్‌తో సురక్షితంగా ఇంటికి
జీపీఎస్ సాయంతో ఆ వ్యక్తి 69 డిగ్రీల అక్షాంశాల దగ్గర ఉన్నట్టు గుర్తించారు
Alasca : యాపిల్ కంపెనీ తీసుకొచ్చిన సాస్ టెక్నాలజీ అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడుతోంది. రెండు రోజుల క్రితం అమెరికాలోని అలస్కాలో చిక్కుకున్న ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అతని ఐ ఫోన్ 14 శాటిలైట్ ద్వారా సాస్ మెసేజ్ అలర్ట్‌ను ఎమర్జెన్సీ సర్వీస్‌కు పంపించింది. దాంతో అతడిని కాపాడారు. యాపిల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్స జీపీఎస్ సాయంతో అతని జాడను కనిపెట్టింది. ఆ వ్యక్తి 69 డిగ్రీల అక్షాంశాల దగ్గర ఉన్నట్టు గుర్తించారు. స్థానిక అధికారులు, రెస్క్యూ టీం, కొంతమంది వాలంటీర్ల సాయంతో అతడు ఉన్న ప్లేస్‌కు వెళ్లారు. అతడిని సురక్షితంగా తీసుకొచ్చారు.
అయితే, అతను తనకు తానుగా ఆ చోట ఉండిపోవడానికి కారణం ఉంది. ఐఫోన్ కొత్తగా తీసుకొచ్చిన ఎమర్జెన్సీ సాస్ అలర్ట్ ఫీచర్ పనిచేస్తుందా? లేదా? అనేది టెస్ట్ చేయాలనుకున్నాడు. అందుకని డిసెంబర్ 1వ తేదీన స్నో మొబైల్ లేదా మోటార్ స్లెడ్ మీద నూర్విక్ నుంచి కొట్జ్బు ప్రాంతానికి వెళ్తూ అలస్కాలో ఒక చోట ఆగాడు. అక్కడ మొబైల్ సిగ్నల్ లేదు. దాంతో, అతని ఐఫోన్ శాటిలైట్ సాయంతో సాస్ మెసేజ్ అలర్ట్‌ను ఎమర్జెన్సీ సర్వీస్‌కు పంపించింది. దాంతో అతడిని కనిపెట్టారు. సాస్ ఫీచర్‌ను టెస్ట్ చేయడం కోసం ప్రాణాలను పణంగా పెట్టడం ఏంటని? చాలామంది వాపోతున్నారు. మరికొందరు యాపిల్ సాస్ ఫీచర్ అద్భుతం అంటన్నారు.
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. సాస్ వ్యవస్థ 62 డిగ్రీల అక్షాంశాలు దాటితే పనిచేయదని యాపిల్ ఇంతకుముందు తెలిపింది. కానీ, ఈ వ్యక్తి చిక్కుకున్న 69 డిగ్రీల అక్షాంశాలలోనూ సాస్ అలర్ట్ సిస్టం పనిచేయడం. ఐఓఎస్ 16.1 అప్డేట్లో భాగంగా ఎమర్జెన్సీ సాస్ మెసేజ్, వాయిస్ కాల్ అలర్ట్‌ను యాపిల్ తీసుకొచ్చింది. అత్యవసర పరిస్థితి, ప్రమాదంలో ఉన్నప్పుడు వైఫై లేదా మొబైల్ డేటా లేకున్నా కూడా సర్వీస్ పనిచేస్తుంది. ఈ ఫీచర్ ఐ ఫోన్ 14 సిరీస్‌లో ఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

