Facebook Protect | మీ ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అవుతోందా? లాగిన్‌లో సమస్యలు ఉన్నాయా? అయితే మీరు ఫేస్బుక్ ప్రొటెక్ట్ యాక్టివేట్ చేసుకోలేదన్నమాట. అవును.. ఫేస్బుక్ ఇటీవల ఫేస్బుక్ ప్రొటెక్ట్ అనే ఓ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్. ఈ ఫీచర్‌ను ప్రతి ఒక్క యూజర్ యాక్టివేట్ చేసుకోవాలని మెటా వెల్లడించింది.
టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌తో ఫేస్బుక్ ప్రొటెక్ట్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 17 లోపు మీ అకౌంట్‌కు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్ అయిన ఫేస్బుక్ ప్రొటెక్ట్‌ను యాక్టివేట్ చేసుకోండి.. అంటూ ఫేస్బుక్.. అందరు యూజర్లకు మెయిల్స్ చేసింది.
ఒకవేళ ఫేస్బుక్ ప్రొటెక్ట్ యాక్టివేట్ చేసుకోకపోతే.. యూజర్ల అకౌంట్లను ఫేస్బుక్ లాక్ చేసేస్తోంది. ఇప్పటికే కొందరు యూజర్ల అకౌంట్లను ఫేస్బుక్ లాక్ చేసింది. ఒకసారి అకౌంట్ లాక్ అయిపోతే వాళ్లు ఆ అకౌంట్‌కు ఇక లాగిన్ కాలేరు. అందుకే.. మీ అకౌంట్‌ను కూడా ఫేస్బుక్ లాక్ చేయకముందే వెంటనే ఫేస్బుక్ ప్రొటెక్ట్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోండి.
దాని కోసం ఫేస్బుక్ అకౌంట్‌ను ఓపెన్ చేసి రైట్సైట్ ఉన్న డ్రాప్ డౌన్ ఆరో మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్లీ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఫేస్బుక్ ప్రొటెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే వెల్కమ్ స్క్రీన్ కనిపిస్తుంది. ఫేస్బుక్ ప్రొటెక్ట్ బెనిఫిట్స్ స్క్రీన్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఫేస్బుక్ ప్రొటెక్ట్ ఆప్షన్‌ను టర్న్ ఆన్ చేయాలి. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌లో భాగంగా స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫిక్స్ నవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే చాలు.. ఫేస్బుక్ ప్రొటెక్ట్ ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది.