Google | ప్లే స్టోర్ నుంచి 9లక్షల యాప్‌లను తొలగించనున్న గూగుల్.. అదే బాటలో యాపిల్..!
Google | ప్రముఖ టెక్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్లే స్టోర్‌లోని యాప్స్‌ను అప్ చేయాలని లేదంటే.. తొలగిస్తామని హెచ్చరించింది. అయితే, గూగుల్‌ను హెచ్చరించినా యాప్స్ డెవలపర్లు పట్టించుకోకపోవడంతో తొమ్మిది లక్షల యాప్స్‌ను తొలగించేందుకు సిద్ధమైంది. వినియోగదారుల ప్రైవసీ కోసమే గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నది. ఆండ్రాయిడ్ అథారిటీ ప్రకారం.. గూగుల్ యాప్ స్టోర్‌లోని యాప్‌ల సంఖ్యను మూడింట ఒక వంతు తగ్గించనున్నది. ఇంతకు ముందు ఆపిల్ సైతం తన ప్లే స్టోర్ నుంచి అదే తరహా యాప్‌లను తొలగించాలని నిర్ణయించింది.
గత రెండేళ్లుగా యాప్స్ డెవలపర్లు ఎలాంటి అప్డేట్స్ చేయకపోవడంతోనే ఈ నిర్ణయానికి వచ్చింది. సెనేట్ ప్రకారం.. గూగుల్, ఆపిల్ తమ వినియోగదారుల ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని చర్యలు చేపడుతున్నాయి. నివేదిక ప్రకారం.. పాత యాప్‌లు ఆండ్రాయిడ్, iOSలలో మార్పులు, కొత్త APIలు భద్రతను మెరుగుపరచడానికి కొత్త పద్ధతులను ఉపయోగించుకోవడం లేదు. ఈ కారణంగా, పాత యాప్‌లు భద్రత ఉండదు. మరో వైపు గూగుల్ ఇటీవల థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్‌లను నిషేధించింది. గత నెలలోనే అన్ని కాల్ రికార్డింగ్ యాప్స్ ప్లే స్టోర్ నుంచి నిషేధం విధిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది.
ఇందులో భాగంగా ప్లే స్టోర్ విధానంలో మార్పులు తీసుకురాగా.. ఈ నెల 11 నుంచి కాల్ రికార్డింగ్ యాప్స్‌ను బ్యాన్ చేసింది. అయితే, ఇన్‌బిల్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్‌తో వచ్చే ఫోన్లలో ఎలాంటి మార్పులుండవు. ఆండ్రాయిడ్ యూజర్ల ప్రైవసీని మరింత పటిష్టం చేయడంలో భాగంగా ఆయా కాల్ రికార్డింగ్ ఫీచర్ అప్లికేషన్లను నిరోధించేందుకు గూగుల్ కఠినమైన చర్యలు చేపట్టింది. ఇకపై ప్లే స్టోర్‌లో రిమోట్ కాల్ ఆడియో రికార్డింగ్ వంటి యాప్స్ యాక్సస్ చేసుకోలేరు. ఆండ్రాయిడ్ యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌లతో సహా గూగుల్ డెవలపర్ విధానాలను అప్డేట్ చేసింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

