Google Play Pass | రూ.99కే గూగుల్ ప్లే పాస్.. దీని వల్ల ఏంటి ఉపయోగం?
ఆ ఫోన్లే చీప్ అండ్ బెస్ట్. ఐఫోన్ కొనాలంటే వేలకు వేలు వెచ్చించాల్సిందే. ఐఫోన్ ఐవోఎస్‌తో పని చేస్తుంది. ఇతర స్మార్ట్ఫోన్లన్నీ ఆండ్రాయిడ్
Google Play Pass | ఈరోజుల్లో స్మార్ట్ఫోన్లు వాడనివాళ్లు చాలా తక్కువ. రోజురోజుకూ స్మార్ట్ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. మన దేశంలో ఆండ్రాయిడ్ ఫోన్లనే ఎక్కువగా జనాలు వాడుతారు. ఎందుకంటే ఆ ఫోన్లే చీప్ అండ్ బెస్ట్. ఐఫోన్ కొనాలంటే వేలకు వేలు వెచ్చించాల్సిందే. ఐఫోన్ ఐవోఎస్‌తో పని చేస్తుంది. ఇతర స్మార్ట్ఫోన్లన్నీ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో నడుస్తాయి. ఆండ్రాయిడ్ యాప్స్‌ను గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
అందులో కొన్ని ఫ్రీ యాప్స్ ఉంటాయి. మరికొన్ని ప్రీమియం యాప్స్ ఉంటాయి. ప్రీమియం యాప్స్ కొనుగోలు చేయాలంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. మరికొన్ని యాడ్స్ ఫ్రీ యాప్స్ కూడా ఉంటాయి. దానికోసమే.. గూగుల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 2019లోనే యూఎస్‌లో ఈ సర్వీస్ అందుబాటులోకి రాగా.. భారత్‌లో తాజాగా ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.
దాన్నే గూగుల్ ప్లే పాస్‌గా పిలుస్తారు. దీనికి సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి నెల వారీ ప్లాన్స్ ఉంటాయి.. వార్షిక ప్లాన్స్ ఉంటాయి. నెలకు రూ.99 లేదా.. సంవత్సరానికి రూ.889 చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే పాస్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకున్నాక.. వివిధ యాప్స్, గేమ్స్‌కు కేవలం ఈ పాస్ ఉన్నవాళ్లకే యాక్సెస్ ఉంటుంది. స్పోర్ట్స్, పజిల్స్, యాక్షన్ గేమ్స్ లాంటి వాటి యాక్సెస్ ఉంటుంది. పాపులర్ గేమ్స్ అయిన జంగిల్ అడ్వెంచర్స్, వరల్డ్ క్రికెట్ బ్యాటిల్ 2, మాన్యుమెంట్ వ్యాలీ లాంటి యాప్స్‌ను ఈ పాస్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

