Google Search Engine : గూగుల్ సెర్చ్ ఇంజన్ మరో ముందడుగు.. మరింత ఖచ్చితత్వంతో సెర్చ్ రిజల్ట్స్
గూగుల్.. ఇప్పుడు ప్రపంచమంతా ఏదైనా సమాచారం కోసం దీనిమీదే ఆధారపడుతోంది. గూగుల్ సెర్చ్ ఇంజన్‌ను ఉపయోగించి.. ఏ సమాచారం కావాలన్నా.. క్షణాల్లో తెలుసుకుంటున్నాం. ఇదివరకు ఏదైనా సమాచారం కావాలంటే.. దాని కోసం సంబంధిత పుస్తకాల్లో వెతికేవాళ్లం. దాని కోసం చాలా సమయం పట్టేది. కానీ.. నేడు.. ఏ సమాచారం అయినా సరే.. ఎప్పటిదైనా సరే.. క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటును గూగుల్ కల్పించింది.

అయితే.. గూగుల్.. సెర్చ్ రిజల్ట్స్‌ను మరింత ఆక్యురేట్, సంబంధిత సమాచారం ఇచ్చేందుకు కొత్త సిస్టమ్‌ను తీసుకొస్తోంది. ఒక్కోసారి ఏదైనా సమాచారం కోసం గూగుల్‌లో వెతికినప్పుడు దానికి సంబంధించిన సమాచారంతో పాటు.. అవసరం లేని సమాచారం కూడా వస్తుంటుంది. అలాగే.. ఖచ్చితమైన సమాచారం కోసం, ఎక్కువ సంబంధిత సమాచారం కోసమే గూగుల్ సరికొత్త సిస్టమ్‌పై వర్క్ చేస్తోంది. దాని కోసం వెబ్ పేజీలకు జనరేటింగ్ టైటిల్స్ అనే కొత్త సిస్టమ్‌ను తీసుకొచ్చింది.
సాధారణంగా ర్యాంక్ రిజల్ట్స్ కోసం ఉపయోగించే హెచ్‌టీఎంఎల్ టైటిల్ ట్యాగ్స్ కంటే కూడా ఇంకా వేరే టెక్నాలజీని ఉపయోగించి.. జనరేటింగ్ టైటిల్స్ అనే కాన్సెప్ట్‌పై గూగుల్ వర్క్ చేస్తోంది.
హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ కంటే కూడా టెక్స్ట్‌ను ఉపయోగించి యూజర్లు చేసే సెర్చ్ మీద గూగుల్ ఎక్కువగా దృష్టి పెడుతోంది.
సెర్చ్ రిజల్ట్స్‌లో ప్రతిసారీ వెబ్సైట్ లిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి?
హెచ్‌టీఎంఎల్ టైటిల్ ట్యాగ్స్ ప్రతిసారి.. ఒక వెబ్‌పేజిని పర్ఫెక్ట్గా తీర్చిదిద్దలేవు. ఎందుకంటే.. టైటిల్ ట్యాగ్స్ ఒక్కోసారి పొడవుగా ఉండటం, కీవర్డ్స్ రిపీట్‌గా ఉండటం వల్ల.. సెర్చ్ రిజల్ట్స్‌లో తేడా వచ్చే అవకాశం ఉంటుంది.
ఎక్కువగా కీవర్డ్స్‌ను ఉపయోగించి పేజీలను నింపేస్తే సెర్చ్ రిజల్ట్స్‌లో వెబ్ పేజీలు వస్తాయని అనుకోవడం పొరపాటు. చాలామంది కంటెంట్ క్రియేటర్లు.. వెబ్ పేజీలలో రిపీట్‌గా కీవర్డ్స్ యాడ్ చేస్తుంటారు. దాని వల్ల ఏ ఉపయోగం ఉండదు.. అని గూగుల్ బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది.

కొన్ని వెబ్ పేజీలకు టైటిల్ ట్యాగ్స్ ఉండవు. లేదా.. రిపీటెడ్ టాగ్స్ ఉంటాయి. దాని వల్ల.. సెర్చ్ రిజల్ట్స్ మీద ప్రభావం పడుతుంది. హోమ్ పేజీ పేరును సింపుల్‌గా హోమ్ అని పెడుతుంటారు. కొన్ని సైట్లలో అన్ని పేజీలను కలిపి అన్టైటిల్డ్ అని ఇస్తుంటారు. అందుకే.. ప్రతి వెబ్ పేజీకి సపరేట్ టైటిల్ జనరేట్ చేస్తే.. ఆ టైటిల్ ద్వారా పేజీని యాక్సెస్ చేసుకోవచ్చు. కొన్ని సార్లు మేము సైట్ పేర్లను కూడా ఉపయోగించి.. టైటిల్స్‌ను జనరేట్ చేస్తాం.. అని గూగుల్ వెల్లడించింది.
ప్రతి వెబ్సైట్ ఓనర్.. హెచ్‌టీఎంల్ టైటిల్ ట్యాగ్స్‌ను క్రియేట్ చేస్తే… మేము జనరేట్ చేసే టైటిల్స్, హెచ్‌టీఎంల్ టైటిల్ ట్యాగ్స్ కంటెంట్‌ను ఆల్గారిథమ్ రీడ్ చేసి.. దానికి సంబంధించిన యూజర్ కీవర్డ్స్ ఆధారంగా 80 శాతం వరకు ఖచ్చితత్వం, సంబంధిత సమాచారాన్ని గూగుల్ సెర్చ్ ఇంజన్ యూజర్లకు అందిస్తుంది.. అని బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ పేర్కొంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్‌లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

