1800 యాప్ లను తొలగించిన గూగుల్… కారణం ఇదే…!

హైదరాబాద్, జూలై:నాలుగేండ్లలో 1800 యాప్ లను గూగుల్ తొలగించింది. ఇటీవల కాలంలో జోకర్ యాప్ ల ద్వారా మాల్వేర్ ఫోన్లలో చొరబడి, డ్యామేజ్ చేస్తున్నది. వ్యక్తిగత సమాచారం నుంచి ఆర్థిక లావాదేవీల వరకు అన్ని రకాల సమాచారాన్నిసేకరించి హ్యాకర్లకు పంపుతుంది. ఇటువంటి మాల్వేర్ పై దృష్టి సారించిన గూగుల్ నాలుగేండ్ల నుంచి దాదాపు 1800 యాప్స్ తొలగించింది.
కొంతకాలంగా ప్లే స్టోర్ లోని యాప్ లను ఎప్పటికప్పుడు తనిఖీ చే స్తూ ఈ జోకర్ మాల్వేర్ ఉన్న యాప్ లను తొలగించే పనిలో పడింది. అయినప్పటికీ దీని ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. హ్యాకర్లు జోకర్ మాల్వేర్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ కొత్తగా ప్రయోగిస్తుండడమే అందుకు కారణం. దాంతో దీన్ని గుర్తించడం నిపుణులకు కష్టమవుతోంది. సాఫ్ట్ వేర్ల తరహాలో ఈ ప్రమాదకర మాల్వేర్ లోనూ కొత్త వెర్షన్లు తీసుకొస్తుండడంతో, వాటికి విరుగుడు రూపొందించడానికి సైబర్ నిపుణులకు ఎక్కువ సమయం పడుతోంది. ఈలోపే జోకర్ కొత్త వెర్షన్ విజృంభిస్తున్నది.

తాజాగా ప్లేస్టోర్ లోని కొన్ని యాప్ లపై ఓ మాల్వేర్ దాడి చేస్తున్నట్టు గుర్తించిన సైబర్ నిపుణులు, మరింత లోతుగా పరిశోధించగా ఇది కొత్త జోకర్ పనే అని తేలింది. ఇది కెమెరా, ఫొటో ఎడిటింగ్, ప్రాసెసింగ్, మెసెంజర్, గేమింగ్, వాల్ పేపర్, ట్రాన్స్ లేషన్ యాప్ లను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తోందని, వాటి ద్వారా ఫోన్లలోకి ప్రవేశిస్తున్నదని గుర్తించారు.
ఇది ఓ యాప్ పై దాడి చేయగానే, మొదటి యాప్ కోడ్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అందులో యాప్ లేటెస్ట్ వెర్షన్ సమాచారం లేకపోతే మాల్వేర్ ఎలాంటి ప్రభావం చూపదు. యాప్ లేటెస్ట్ వెర్షన్ సమాచారం ఉంటే మాత్రం ఫోన్ యూజర్ వివరాలన్నీ తస్కరిస్తుంది. అందుకోసమే యూజర్లు యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ లతో ఫోన్లను స్కాన్ చేస్తుండాలని, యాప్ స్టోర్లలో ఆయా యాప్ ల రేటింగ్ లను బట్టి కూడా వాటి భద్రతను అంచనా వేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

