New Year Eve | అయిపోయింది.. ఇంకొన్ని గంటలు అంతే. 2021 సంవత్సరానికి ఇక గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైంది. 2022కి వెల్కమ్ చెప్పేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. 2021 సంవత్సరానికి అందరూ ఇవాళ వీడ్కోలు పలుకుతున్నారు. ఈసందర్భంగా న్యూ ఇయర్ ఈవ్‌ను గూగుల్ సపరేట్గా యానిమేటెడ్ డూడుల్‌తో సెలబ్రేట్ చేసింది. హ్యాపీ న్యూ ఇయర్ ఈవ్ పేరుతో తయారు చేసిన డూడుల్‌ను సెర్చ్ ఇంజిన్లోకి వెళ్లి క్లిక్ చేయగానే న్యూ ఇయర్స్ ఈవ్ పేరుతో మరో పేజీ ఓపెన్ అవుతుంది.
న్యూ ఇయర్ ఈవ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, వెబ్సైట్లను చూపించడంతో పాటు.. రంగు రంగుల కాగితాలను పై నుంచి కిందికి వెళ్లేలా రూపొందించింది. హ్యాపీ న్యూఇయర్ ఈవ్.. 2021కి వీడ్కోలు అంటూ డూడుల్‌కు క్యాప్షన్ పెట్టింది గూగుల్.
గత రెండేళ్ల నుంచి కొత్త సంవత్సరం వేడుకలు అనుకున్నంతగా జరగడం లేదు. దానికి కారణం కరోనా మహమ్మారి. ఈసారి కూడా కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి.