చరిత్రలో ఈరోజు: సూర్యుడి చుట్టూ భూమి తిరగడమా.. గెలీలియోను ప్రవేశపెట్టుడు..!
‘సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది’ అనే సిద్ధాంతం నిజమని చెప్పిన గెలీలియో గెలీలీకి రోమ్ చర్చి అధికారులు 1634 లో సరిగ్గా ఇదే రోజున శిక్ష...
Today History: తాను పుట్టక ముందు నికోలస్ కోపర్నికస్ అనే శాస్త్రవేత్త చెప్పిన ‘సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది’ అనే సిద్ధాంతం నిజమని చెప్పిన గెలీలియో గెలీలీకి రోమ్ చర్చి అధికారులు 1634 లో సరిగ్గా ఇదే రోజున శిక్ష విధించారు. ఇది జరిగిన 350 ఏండ్ల తర్వాత రోమ్ చర్చి తాము చేసింది తప్పని ప్రకటించారు. దాంతో అప్పటి నుంచి మహామహ శాస్త్రవేత్తలు ఆయనను ‘ఆధునిక విజ్ఞాన పితామహుడు’గా కీర్తించారు.
పోలాండ్‌కు చెందిన గణిత శాస్త్రజ్ఞుడు నికోలస్ కోపర్నికస్.. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చెప్పారు. ఈ విషయాన్నిఆయన చెప్పాడే కానీ చర్చికి భయపడి దాన్ని ఎక్కడా వ్రాయలేదు. ఆయన చనిపోయిన 21 ఏండ్లకు.. ఇటలీలోని పిసాలో 1564 లో ఫిబ్రవరి 15 న గెలీలియో గెలీలీ జన్మించాడు. అనంతరం కోపర్నికస్ చెప్పిన సిద్ధాంతాన్నే ఈయన కూడా చేపట్టి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని ‘డైలాగ్’ అనే పుస్తకంలో వివరంగా రాశాడు.
ఈ విషయం తెలిసిన రోమ్ చర్చి అధికారులు.. గెలీలియాపై విచారణ చేపట్టి ఆయన చెప్పిన సిద్ధాంతం తప్పని తేల్చింది. వెంటనే ఆయన్ను తమ ఎదుట ప్రవేశపెట్టాలని రోమ్ చర్చి ఆదేశించింది. 1634 ఫిబ్రవరి 13న గెలీలియోను రోమ్ తీసుకెళ్లి పోప్ ఎదుట ప్రవేశపెట్టారు. ఆ సమయంలో కూడా గెలీలియో తన వాదనకు కట్టుబడి తాను వ్రాసింది సరైనదనే అని చెప్పడంతో అతడిని జైలులో పెట్టారు.
ఆ తర్వాత చర్చి ఎదుట క్షమాపణలు చెప్పడంతో శిక్షను మార్చి గృహనిర్బంధంలో ఉంచారు. ఆయన పుస్తకాలను ముద్రించకుండా నిషేధం విధించారు. గృహ నిర్బంధంలో ఉండగానే 1642 జనవరి 8 న కన్నుమూశాడు. ఇలాఉండగా, గెలీలియో మరణించిన దాదాపు 350 సంవత్సరాల తర్వాత.. 1992 అక్టోబర్‌లో పోప్ జాన్ పాల్ ఆనాడు చర్చి చేసింది తప్పు అని, గెలీలియో వాదన సరైనదని గుర్తించాడు. స్టీఫెన్ హాకింగ్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి ప్రసిద్ధ శాస్త్రవేత్తలు గెలీలియో గెలీలీని ‘ఆధునిక విజ్ఞాన పితామహుడు’ అని కీర్తించారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
- 2017: కౌలాలంపూర్ విమానాశ్రయంలో దారుణహత్యకు గురైన ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరుడు కిమ్ జోంగ్ నామ్
- 2010: పుణేలో యూదుల మందిరం సమీపంలోని బేకరీలో బాంబు పేలుడు, 17 మంది దుర్మరణం
- 2001: ఎల్ సాల్వడార్లో భూకంపం, 400 మంది దుర్మరణం
- 1991: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌పై బాంబు దాడులు ప్రారంభించిన అమెరికా యుద్ధ విమానాలు
- 1975: న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం
- 1879 : స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు జననం
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

