లేటెస్ట్ ఫీచర్లతో ఫైర్ బోల్ట్ అపోలో స్మార్ట్‌వాచ్ లాంఛ్..ధర ఎంతంటే..!
అందుబాటు ధరలో స్టైలిష్ లుక్, అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఫైర్ బోల్ట్ అపోలో స్మార్ట్‌వాచ్ కస్టమర్లను ఆకట్టుకోనుంది.
న్యూఢిల్లీ : ప్రముఖ వేరబుల్స్ బ్రాండ్ ఫైర్ బోల్ట్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో అపోలో స్మార్ట్‌వాచ్‌ను లాంఛ్ చేసింది. వాయిస్ అసిస్టెంట్, 100 స్పోర్ట్స్మోడ్స్తో 1.43 ఇంచ్ రౌండ్ ఆల్వేస్ ఆన్ అమోల్డ్ డిస్ప్లేతో ఫైర్ బోల్ట్ అపోలో స్మార్ట్‌వాచ్ కస్టమర్ల ముందుకొచ్చింది. స్మార్ట్ ఫీచర్లతో ఓల్డ్ క్లాసిక్ రౌండ్ షేప్ డయల్‌ను కోరుకునే యూజర్లకు ఈ స్మార్ట్‌వాచ్ పర్ఫెక్ట్ ఛాయిస్.
అందుబాటు ధరలో స్టైలిష్ లుక్, అడ్వాన్స్డ్ ఫీచర్లతో అపోలో స్మార్ట్‌వాచ్ ఆకట్టుకుంటుందని ఫైర్ బోల్ట్ సహ వ్యవస్ధాపకులు ఆయుషి, అర్ణవ్ కిషోర్‌లు తెలిపారు. మోడరన్ జనరేషన్ యూత్ లక్ష్యంగా ఈ స్మార్ట్‌వాచ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఫైర్ బోల్ట్ అపోలో భారత్‌లో రూ. 2999కు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ బ్లాక్, గ్రే, పింక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అపోలో స్మార్ట్‌వాచ్ కొనుగోలుకు అందుబాటులో ఉంది. 120 నిమిషాల చార్జింగ్ టైమ్‌తో ఐదు రోజులు బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఫిట్నెస్ గోల్స్ ట్రాక్ చేసేందుకు ఈ వాచ్‌లో 100 స్పోర్ట్ మోడ్స్‌తో పాటు ఎస్పీఓ2, హోర్ట్ రేట్ మానిటర్, స్లీప్ మానిటరింగ్ వంటి పలు హెల్త్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఐపీ67 రేటింగ్‌తో ఫైర్ బోల్ట్ అపోలో అవుట్డోర్స్, జిమ్ వంటి యాక్టివిటీస్ కోసం వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగిఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

