Facebook India : చిరు వ్యాపారులకు అండగా ఫేస్బుక్.. లోన్ బిజినెస్‌లోకి అడుగు
ఫేస్బుక్ మరో అడుగు ముందుకు వేసింది. చిన్న వ్యాపారులకు అండగా ఉండేందుకు ఫేస్బుక్ ఓ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్‌ను ఫేస్బుక్ ఇండియాలో లాంచ్ చేసింది. దాని పేరు Small Business Loans Initiative. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఫేస్బుక్లో అడ్వర్టైజ్ చేస్తున్న చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు పెట్టుబడికి సంబంధించిన కష్టాలను తీర్చడం కోసం ఈ ప్రోగ్రామ్‌ను ఫేస్బుక్ లాంచ్ చేసింది.

ఇండియాలోని 200 నగరాల్లో ఈ ప్రోగ్రామ్‌ను ఫేస్బుక్ ప్రారంభించింది. దీని కోసం ఫేస్బుక్ Indifi అనే ఫైనాన్సియల్ సంస్థతో టైఅప్ అయింది.
ఇండియాలోని ఎంఎస్ఎంఈ సెక్టార్లో క్రెడిట్ గ్యాప్ లేకుండా చేయడం కోసం, చిన్న వ్యాపారులకు బిజినెస్ లోన్స్‌ను సులభతరం చేయడం కోసమే.. ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభించామని ఫేస్బుక్ వెల్లడించింది.
ఫేస్బుక్.. 2020లో Future of Business అనే ఓ సర్వేను చేయించింది. చిన్న, మధ్యతరహా వ్యాపారులకు క్యాష్ ఫ్లో పెద్ద సమస్యగా ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా స్టార్టప్ బిజినెస్‌లకు లాంగ్ టైమ్ క్రెడిట్ హిస్టరీ ఉండదు కాబట్టి.. అటువంటి వ్యాపారాలకు రుణాలు దొరకడం చాలా కష్టంగా మారింది. ఆ సర్వే ద్వారా చిన్న వ్యాపారుల కష్టాలను తెలుసుకున్న ఫేస్బుక్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఫేస్బుక్లో చిన్న వ్యాపారులు.. తమ వ్యాపారానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినప్పటికీ.. వాళ్లకు 17 నుంచి 20 శాతం వరకు వార్షిక వడ్డీతో లోన్స్ ఇవ్వనున్నట్టు ఫేస్బుక్ వెల్లడించింది. ఈ వ్యాపారులకు ఎటువంటి షూరిటీ లేకుండానే ఆన్లైన్ ద్వారా అప్లయి చేసుకుంటే.. ఫేస్బుక్ వెంటనే లోన్‌ను అప్రూవ్ చేయనుంది. అలాగే.. ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. అప్లయి చేసుకున్న 5 రోజుల్లో లోన్ అమౌంట్‌ను ఇండిఫీ ఫైనాన్సియల్ సంస్థ క్రెడిట్ చేస్తుంది. కనీసం 5 లక్షల నుంచి 50 లక్షల వరకు బిజినెస్ రేంజ్‌ను బట్టి ఫేస్బుక్ లోన్‌ను అందివ్వనుంది.
ఈ ప్రోగ్రామ్‌ను వర్చువల్ ఈవెంట్ ద్వారా ఎఫ్ఐసీసీఐ పార్టనర్షిప్తో ఫేస్బుక్ ఇండియా ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్‌కు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కూడా హాజరయ్యారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

