End of an era for IPod | ఇక ఆపిల్ ఐప్యాడ్స్ ఉండవ్.. కారణం ఇదీ..!
End of an era for IPod | ఆపిల్‌ను దివాళా దశ నుంచి 3 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తెచ్చిన ఐ-ప్యాడ్స్ పూర్తిగా కనుమరుగవుతోంది.
End of an era for IPod | ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ దిగ్గజం ఆపిల్.. కానీ ఆ కంపెనీ పూర్తిగా దివాళా అంచుకు చేరిన రోజులవి. కంపెనీ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్ తీసుకున్న నిర్ణయం ఆపిల్‌కు ఆర్థిక జవసత్వాలు కల్పించింది. అంతే కాదు.. ఈనాడు మూడు లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ గల తొలి సంస్థగా నిలిపింది. అదే ఆపిల్ ఐ-ప్యాడ్. ఇప్పుడు ఆపిల్‌కు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న ఐ-ఫోన్, ఐప్యాడ్, ఎయిర్ ప్యాడ్స్.. అన్నీ ఐ-ప్యాడ్ నుంచి పుట్టుకొచ్చినవే.
కానీ కాల క్రమంలో అనునిత్యం టెక్నాలజీలో వచ్చిన మార్పులతో రకరకాల మ్యూజిక్ ప్లేయర్లు అందుబాటులోకి రావడంతో ఐ-ప్యాడ్స్‌కు ప్రాధాన్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఫలితంగా ఇక నుంచి ఐ-ప్యాడ్స్ ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ఆపిల్ అధికారికంగా ప్రకటించింది. రెండున్నర దశాబ్దాలకు పైగా మ్యూజిక్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చిన ఐ-ప్యాడ్ ( iPod ) ఇక పూర్తిగా కనుమరుగవుతున్నది.
తొలుత 2001 అక్టోబర్‌లో ఐపాడ్ మార్కెట్లోకి వచ్చింది. తదుపరి 2007లో టచ్‌స్క్రీన్ మోడల్ ఆవిష్కరించింది. తాజాగా ఐ-పాడ్‌లో చివరి ఉత్పత్తి ఐ-పాడ్ టచ్‌ను నిలిపివేస్తున్నట్లు ఆపిల్ ప్రకటించింది. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న ప్యాడ్స్ మాత్రం విక్రయిస్తామని వివరించింది.
2017 ఏప్రిల్‌లో ఆపిల్ తన అత్యంత చిన్న మ్యూజిక్ ప్లేయర్ ఐపాడ్ నానో, ఐపాడ్ షఫిల్ ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు 2014 నుంచి దశల వారీగా ఐప్యాడ్ల ఉత్పత్తి నిలిపివేస్తూ వచ్చింది. తొలుత 2014లో ఐపాడ్ క్లాసిక్ తయారీ నిలువరించింది.
కొన్నేండ్లుగా ఐఫోన్‌కు చౌక ప్రత్యామ్నాయంగా భావించే ఐపాడ్ టచ్ మాత్రం కొన్నేండ్ల పాటు అందుబాటులో ఉంటుంది. 2019లో అప్డేట్ చేసిన ఐపాడ్ టచ్ ధర 199 డాలర్లు. ఐఫోన్లలో అత్యంత చౌకగా లభించే ఎస్ఈ మోడల్ ధర 429 డాలర్లు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Apple
- End Era
- Ipod
- Steev Jobs
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

