Elon Musk | గ్రోక్ ఏఐ రాసిన కవితను షేర్ చేసిన మస్క్
గ్రోక్ ఏఐ ఈ వారంలో లాంఛ్ కానుంది. ట్విట్టర్ అధిపతి ఎలన్ మస్క్ గ్రోక్ ఏఐ రాసిన కవితను షేర్ చేశారు. ఈ కవిత అంతా ప్రేమను పంచడం చుట్టూ సాగుతుంది. గ్రోక్ ఏఐని మస్క్ (Elon Musk) సారధ్యంలోని ఎక్స్ఏఐ టీం లాంఛ్ చేయనుంది.
న్యూయార్క్ : గత ఏడాది నవంబర్‌లో ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ లాంఛ్ అయినప్పటి నుంచి టెక్ ప్రపంచంలో లేటెస్ట్ టెక్నాలజీపై హాట్ డిబేట్ సాగుతోంది. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం నుంచి సంక్లిష్ట పనులు చక్కబెట్టడం, పుస్తకాలు రాయడం వరకూ చాట్‌జీపీటీ చిటికెలో సొల్యూషన్స్ అందింస్తుండటంతో పలు కంపెనీలు ఏఐ చాట్‌బాట్స్‌పై కసరత్తు సాగిస్తున్నాయి. ఇక మరో ఏఐ చాట్‌బాట్ సైతం వినూత్న ఫీచర్లతో యూజర్ల ముందుకు రానుంది.
గ్రోక్ ఏఐ ఈ వారంలో లాంఛ్ కానుంది. ట్విట్టర్ అధిపతి ఎలన్ మస్క్ గ్రోక్ ఏఐ రాసిన కవితను షేర్ చేశారు. ఈ కవిత అంతా ప్రేమను పంచడం చుట్టూ సాగుతుంది. గ్రోక్ ఏఐని మస్క్ (Elon Musk) సారధ్యంలోని ఎక్స్ఏఐ టీం లాంఛ్ చేయనుంది. ఇతర చాట్‌బాట్స్ దాటవేసే స్పైసీ ప్రశ్నలకూ గ్రోక్ ఏఐ బదులిస్తుందని ఇప్పటికే ఎక్స్ఏఐ టీం వెల్లడించింది. హాస్య ధోరణి లేని వారికి ఇది అంతగా నచ్చదని కూడా చెబుతున్నారు. గ్రోక్ ఏఐ ఇప్పటివరకూ అందరికీ అందుబాటులోకి రాకున్నా ఏఐ చాట్‌బాట్‌తో సంభాషించిన పలువురి సంభాషణల స్క్రీన్‌షాట్స్‌ను మస్క్ తరచూ షేర్ చేస్తున్నారు.
ప్రేమ గురించి ఓ కవిత రాయాలని మస్క్ ఇటీవల అప్‌కమింగ్ ఏఐ టూల్‌ను అడిగారు. గ్రోక్ ఏఐ రాసిన కవితను మస్క్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ పద్యం 14 పంక్తులు, 4 పద్యాలను కలిగి ఉంది. ఇది మనుషులు సైతం రాసేందుకు సంక్లిష్టంగా భావించే ఏఏ, బీబీ రైమింగ్ స్కీమ్‌తో ఆకట్టుకుంటుంది. ప్రేమించిన అనుభూతి మనల్ని ఎలా ఫీల్ చేస్తుందో ఈ కవిత చెబుతుంది. కాగా గ్రోక్ ఏఐ వచ్చే వారం ఎక్స్ ప్రీమియం ప్లస్ సబ్స్ర్కైబర్లందరికీ అందుబాటులో ఉంటుందని మస్క్ పేర్కొన్నారు.

Read More :
Alia Bhatt | డబ్బు కోసం నటించాలంటే భయం వేస్తుంది.. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

