eBay | అమెరికాకు చెందిన ప్రముఖ ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ ఈబే క్రిప్టో పేమెంట్స్‌కు పచ్చజెండా ఊపింది. త్వరలోనే క్రిప్టో పేమెంట్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఈబే ప్రకటించింది. యూత్‌ను ఈబే వైపు ఆకర్షించడం కోసమే.. క్రిప్టో పేమెంట్స్‌ను తీసుకురానున్నట్టు ఈబే స్పష్టం చేసింది.
ఎక్కువగా 18 నుంచి 49 ఏళ్ల వయసు ఉన్న వాళ్లే క్రిప్టోలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆ ఏజ్ గ్రూప్‌ను తమవైపునకు తిప్పుకునేందుకు ఈబేలో క్రిప్టో పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేసేందుకు ఈబే సన్నాహాలు చేస్తోంది.
మార్చి 10న క్రిప్టో పేమెంట్స్‌కు సంబంధించి ఈబే ప్రకటన చేసే అవకాశం ఉంది. నిజానికి ఎన్ఎఫ్టీలను కూడా ఈబేలో అమ్మకానికి పెట్టారు. కొందరు సెల్లర్స్.. డిజిటల్ ఆర్ట్స్‌ను ఎన్ఎఫ్టీలుగా ఈబేలో అమ్మకానికి పెట్టారు. అఫిషియల్‌గా క్రిప్టో కరెన్సీ గురించి.. ఎన్ఎఫ్టీ ట్రేడింగ్ గురించి ఈబే ఎటువంటి అధికారిక ప్రకటన చేయకున్నా.. ప్లాట్ఫామ్లో ఎన్ఎఫ్టీల ట్రేడింగ్ మాత్రం జరుగుతోంది.
ఈనేపథ్యంలోనే క్రిప్టో పేమెంట్స్‌ను ఈబే తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. యూఎస్‌లో ప్రస్తుతం ఎలొన్ మస్క్ టెస్లా, డల్లాస్ మావెరిక్స్ ఎన్‌బీఐ టీమ్, ఏఎంసీ థియేటర్స్ మాత్రమే క్రిప్టో పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేస్తున్నాయి. వీటి తర్వాత ఈబే వాటి స్థానంలో చేరనుంది. తాము కూడా త్వరలోనే క్రిప్టో పేమెంట్స్‌ను తీసుకొస్తున్నామని ఉబెర్ సీఈవో కూడా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.