న్యూఢిల్లీ : వన్‌ప్లస్ నార్డ్ సీఈకి కొనసాగింపుగా వన్‌ప్లస్ నార్డ్ 2 సీఈని వచ్చే ఏడాది జనవరిలో లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. మోడల్ నెంబర్ ఐవీ2201, కోడ్ నేమ్ ఐవన్తో ఈ స్మార్ట్‌ఫోన్ వివరాలు బీఐఎస్‌లో లిస్టయ్యాయి.
దేశీ మార్కెట్లో త్వరలో ఎంటర్ అవుతున్న వన్‌ప్లస్ నార్డ్ 2 సీఈ స్పెసిఫికేషన్లకు సంబంధించి తాజా లీకులు వెల్లడయ్యాయి. వన్‌ప్లస్ నార్డ్ 2 సీఈ 6.4 ఇంచ్ ఫుల్హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లేతో ఆక్టా కోర్ డైమెన్సిటీ 900 చిప్సెట్తో ముందుకు రానుంది. ముందుభాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు రియర్ సైడ్ 64 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది.
ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌పై ఈ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుందని లీకులు వెల్లడించాయి. 65డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌తో 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో వన్‌ప్లస్ నార్డ్ 2 సీఈ కస్టమర్లను ఆకట్టుకోనుంది. భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ 2 సీఈ ధర రూ 24,000 నుంచి రూ 28,000 వరకూ ఉంటుందని టెక్ నిపుణులు యోగేష్ బ్రార్ అంచనా వేశారు.